ETV Bharat / business

వ్యవసాయ రంగం అండతోనే కరోనా సంక్షోభం దూరం! - ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం

దేశవ్యాప్తంగా అన్​లాక్​ ప్రక్రియ ప్రారంభంతో ఆర్థిక వ్యవస్థ రికవరీ దిశగా పయనిస్తున్నట్లు ఆర్థిక శాఖ తాజా నివేదిక పేర్కొంది. లాక్​డౌన్​తో పోలిస్తే.. ప్రస్తుతం అన్ని ఆర్థిక గణాంకాలు మెరుగవ్వడాన్ని ఆర్థిక వృద్ధికి సంకేతాలుగా అభివర్ణించింది. రికవరీ మెరుగ్గా ఉన్నా.. కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం వల్ల ఇంకా ఆందోళనలు పూర్తిగా తొలగిపోలేదని నివేదిక స్పష్టం చేసింది.

farm sector to cushion COVID-19 impact on economy
కరోనా సంక్షోభానికి వ్యవసాయం అడ్డుకట్ట
author img

By

Published : Aug 4, 2020, 3:18 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు దాదాపుగా ముగిసినట్లేనని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నివేదిక ద్వారా అభిప్రాయపడింది. ఈ సంక్షోభం వల్ల ఆర్థిక వ్యవస్థకు కలిగిన నష్టాన్ని.. ఈ సారి వ్యవసాయ రంగం భర్తీ చేయగలదని ఆశాభావం వ్యక్తం చేసింది. రుతుపవనాలు సకాలంలో దేశంలోకి ప్రవేశించడం, వ్యవసాయ పరిస్థితులు మెరుగుపడటం వంటివి ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంది.

వృద్ధికి విధానాల ప్రోత్సాహం..

ఆర్థిక రికవరీలోనూ భారత్​ మెరుగ్గా ఉందని నివేదిక పేర్కొంది. ఏప్రిల్​తో పోలిస్తే జూన్​లో విడుదలైన ఆర్థిక గణాంకాలు దీన్ని స్పష్టం చేస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వ ఉద్దీపనలు, ఆర్​బీఐ విధానపరమైన నిర్ణయాలతో ప్రగతి రథం వేగం పుంజుకున్నట్లు ఆర్థిక వ్యవహారాల విభాగం వివరించింది.

"అన్​లాక్​ ప్రక్రియ ప్రారంభంతో సంక్షోభం దాదాపుగా ముగిసినట్ల తెలుస్తోంది. ఏప్రిల్ కన్నా జూన్​లో ఆర్థిక గణాంకాలు మెరుగ్గా ఉండటం.. రికవరీకి సంకేతాలుగా భావించొచ్చు. అయితే కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల రిస్క్​ స్థాయి పూర్తిగా తగ్గలేదు."

- ఆర్థిక శాఖ నివేదిక

రికవరీ ఇలా..

ఎనిమితి ప్రధాన రంగాల ఐఐపీ (పారిశ్రామికోత్పత్తి సూచీ) ఏప్రిల్​తో పోలిస్తే.. మేలో పెరిగినట్లు ఆర్థిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీనితో పాటు తయారీ రంగంలో పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) కూడా మేలో 30.8 గా ఉంటే.. జూన్​లో 47.2కు పెరిగింది. సేవారంగంలోనూ పీఎంఐ మేలో 12.6 గా ఉంటే జూన్​లో ఏకంగా 33.7కు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అన్​లాక్​ తర్వాత పరిస్థితులు మెరుగవుతున్నాయనేందుకు ఇవే కీలక సంకేతాలుగా నివేదిక పేర్కొంది.

ఈ గణాంకాలు సానుకూలతలను సూచిస్తున్నా.. కరోనా కేసులు పెరగటం, మధ్యంతర లాక్​డౌన్​లు ఆర్థిక రికవరీకి అడ్డంకిగా మారే ప్రమాదం లేకపోలేదని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి:అభివృద్ధికి కరోనా సవాలు- డోనట్ విధానమే జవాబు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.