ETV Bharat / business

చిరు పరిశ్రమలకు ప్రపంచ బ్యాంక్ భారీ సాయం - MSMEs latest news

కరోనా వేళ భారత్​లోని ఎంఎస్​ఎంఈలకు శుభవార్త అందించింది ప్రపంచ బ్యాంక్. 750 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా భారత్​లోని 15 కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు లబ్ది చేకూరనుంది.

World Bank
ఎంఎస్​ఎంఈలకు ప్రపంచ బ్యాంక్ భారీ సాయం
author img

By

Published : Jul 1, 2020, 2:44 PM IST

కరోనా సంక్షోభం వేళ భారత్​లోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) తీపి కబురు అందించింది ప్రపంచ బ్యాంక్. 750 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించింది. దీనిద్వారా 15 కోట్ల పరిశ్రమలకు లబ్ధి చేకూరనుంది.

2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత్​కు 5.13 బిలియన్ డాలర్లు రుణాల రూపంలో అందించింది ప్రపంచ బ్యాంక్. దశాబ్ద కాలంలో ప్రపంచ బ్యాంక్ అందించిన రుణాల్లో గత ఆర్థిక సంవత్సరం ఇచ్చిన మొత్తమే అధికం. కరోనా పరిస్థితులను ఎదుర్కొనేందుకు మూడు నెలల్లో అందించనున్న 2.75 బిలియన్ డాలర్లు ఇందులో భాగమని స్పష్టం చేసింది.

బహుళ దేశాల రుణ అభివృద్ధి విధాన చట్టం కింద ఈ మొత్తాన్ని భారత్​కు ఇవ్వనున్నట్లు తెలిపారు ప్రపంచ బ్యాంక్ భారత విభాగ డైరెక్టర్ జునైద్ అహ్మద్. ఎంఎస్​ఎంఈలు నగదు కొరత నుంచి బయటపడేందుకు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అందించే పథకాల కింద అందించనున్నట్లు వెల్లడించారు.

చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించేందుకు తదుపరి కార్యక్రమంగా ఎంఎస్​ఎంఈ మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తామని తెలిపింది ప్రపంచ బ్యాంక్. రాష్ట్రాలు క్లస్టర్ స్థాయిలో ఆయా పరిశ్రమల సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది.

కరోనాపై పోరాడేందుకు సామాజిక, ఆరోగ్య రంగాలకు 1 బిలియన్ డాలర్ల సాయాన్ని అందించేందుకు ఇంతకుముందే అంగీకరించింది ప్రపంచ బ్యాంక్.

ఇదీ చూడండి: 'భారతీయ ఫార్మాకు మరో పదేళ్లు చైనానే దిక్కు!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.