ETV Bharat / business

'1991 తర్వాత ఇదే అత్యల్పం.. భారత వృద్ధి 1.5 శాతమే!' - ప్రపంచబ్యాంకు భారత వృద్ధి రేటు 2.8 శాతం

భారత వృద్ధి రేటుపై కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని అభిప్రాయపడింది ప్రపంచబ్యాంకు. 2020-21లో దేశ జీడీపీ వృద్ధి 1.5 శాతం నుంచి 2.8 శాతం మధ్య ఉంటుందని పేర్కొంది. 1991 తర్వాత అత్యంత నెమ్మదైన వృద్ధి ఇదేనని స్పష్టం చేసింది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 5 శాతానికి పుంజుకుంటుందని అంచనా వేసింది.

World Bank sees FY21 India growth
'1991 తర్వాత ఇదే అత్యల్పం- భారత వృద్ధి 1.5శాతమే!'
author img

By

Published : Apr 12, 2020, 3:01 PM IST

కరోనా మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. ఈ మేరకు వృద్ధి అంచనాలు వెలువరించిన ప్రపంచబ్యాంకు... 1991 ఆర్థిక సరళీకరణ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ కనబర్చే అత్యంత దారుణమైన పనితీరు ఇదేనని అభిప్రాయపడింది. 'సౌత్​ ఏషియా ఎకనామిక్​ అప్​డేట్​: ఇంప్యాక్ట్​ ఆఫ్​ కొవిడ్​-19' పేరిట ఓ నివేదిక విడుదల చేసింది.

2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వృద్ధిరేటు కేవలం 1.5 శాతం నుంచి 2.8 శాతం మధ్యే నమోదవుతుందని ప్రపంచబ్యాంకు అంచనావేసింది. అయితే 2022 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 5 శాతానికి పుంజుకుంటుందని తెలిపింది. మార్చితో ముగిసిన 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి 4.8 నుంచి 5 శాతం మధ్య ఉంటుందని స్పష్టం చేసింది.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న సమయంలోనే కొవిడ్-19 విస్తరించిందని ప్రపంచబ్యాంకు పేర్కొంది. లాక్‌డౌన్ కారణంగా సరఫరా, డిమాండ్ తగ్గి వృద్ధిరేటు మరింత క్షీణిస్తోందని వెల్లడించింది.

లాక్​డౌన్​ ఎఫెక్ట్!

భారత్​లో లాక్​డౌన్​ ఎక్కువ కాలం కొనసాగితే ఆర్థిక వ్యవస్థ ఫలితాలు అంచనాల కంటే దారుణంగా ఉండే అవకాశం ఉన్నట్లు ప్రపంచబ్యాంకు ముఖ్య ఆర్థికవేత్త హాన్స్ టిమ్మర్ పేర్కొన్నారు. ప్రస్తుతానికి వైరస్ వ్యాప్తిని తగ్గించడంపైనే ప్రభుత్వం దృష్టిసారించి, అందరికీ ఆహారం అందేలా చూడాలని సూచించారు.

"ఆర్థిక వ్యవస్థను తిరిగి పుంజుకునేలా చేయడంపై దృష్టిసారించడం చాలా ముఖ్యం. తాత్కాలిక ఉద్యోగ కల్పన వంటి ప్రయత్నాలు ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయి. చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలు దివాలా తీయకుండా జాగ్రత్తపడాలి. భారత్​ను ఆర్థికంగా, సామాజికంగా సుస్థిరమైన దారిలో పెట్టడానికి దీర్ఘకాలంలో ఇది ఒక మంచి అవకాశం."

-హాన్స్ టిమ్మర్, ప్రపంచబ్యాంకు ఆర్థిక వేత్త

ఆసియ దేశాల వృద్ధి రేటు 1.8-2.8 శాతం మధ్య నమోదవుతుందని ప్రపంచబ్యాంకు తన నివేదికలో పేర్కొంది. ఇది ఆరు నెలల క్రితం అంచనా వేసిన దానికంటే(6.3) చాలా తక్కువ.

వలస కూలీలతో వైరస్

మరోవైపు స్వస్థలాలకు మరలుతున్న వలస కార్మికులు కరోనా వైరస్ వాహకాలుగా మారే ప్రమాదముందని... ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. వీరి వల్ల కరోనా వైరస్ ప్రభావం లేని ప్రాంతాలకు మహమ్మారి విస్తరించే అవకాశముందని అభిప్రాయపడింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.