ETV Bharat / business

సామాన్యులపై రెపో, రివర్స్​ రెపో రేట్ల ప్రభావం ఎంత? - సాధారణ ప్రజలపై రెపో రేటు ప్రభావం

భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్​బీఐ) ప్రతి రెండు నెలలకు ఓసారి రెపో, రివర్స్​ రెపో రేట్లను సవరిస్తుంది. రేట్లు పెంచటం, తగ్గించటం లేదా యథాతథంగా ఉంచడం.. ఇలా ఏదో ఒక నిర్ణయం తీసుకుటుంది. అసలు ఈ రెపో రేటు, రివర్స్ రెపో రేటు అంటే ఏమిటి? వీటిని తగ్గించడం, పెంచడం వల్ల సామాన్యులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

Reserve Bank of India
భారతీయ రిజర్వు బ్యాంక్
author img

By

Published : Aug 2, 2021, 12:12 PM IST

రిజర్వు బ్యాంకు కీలక వడ్డీ రేట్లను తగ్గించింది లేదా పెంచింది లేదా యథాతథంగా ఉంచింది.. ఇలా ఏదో ఒక వార్త రెండు నెలలకోసారి వింటుంటాం. ఆర్​బీఐ గవర్నర్ అధ్యక్షతన.. ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకుంటుంది.

రెపో, రివర్స్​ రెపో రేట్లనే కీలక వడ్డీ రేట్లు అంటారు. వీటి ప్రభావం సామాన్యుడిపై ప్రత్యక్షంగా ఉండకపోయినా పరోక్షంగా మాత్రం ఉంటుంది. అదెలానో ఇప్పుడు చూద్దాం.

రెపో రేటు..

బ్యాంకులు తమ అవసరాలకు.. రిజర్వు బ్యాంక్​ నుంచి తీసుకునే రుణంపై చెల్లించే వడ్డీనే రెపో రేటు అంటారు. బ్యాంకుల వద్ద ద్రవ్యలభ్యత తక్కువున్న సమయంలో ఇలా రుణం తీసుకుంటాయి.

రివర్స్ రెపో రేటు

బ్యాంకులు తమ వద్ద అదనంగా ఉన్న నగదును ఆర్​బీఐ వద్ద జమ చేస్తుంటాయి. ఇందుకు ఆర్​బీఐ ఆయా బ్యాంకులకు చెల్లించే వడ్డీ రేటునే రివర్స్ రెపో రేటు అంటారు. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యలభ్యత పెరిగి ద్రవ్యోల్బణం ఎక్కువైనా కూడా ఆర్​బీఐ.. వాణిజ్య బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటుంది.

రెపో, రివర్స్ రెపో రేటు ఎంత ఉండాలి అనే విషయంపై తుది నిర్ణయం ఆర్​బీఐదే.

రివర్స్ రెపో రేటు సాధారణంగా రెపో రేటు కంటే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. బ్యాంకులు తమ వద్ద ఉన్న నగదును వ్యక్తులకు లేదా సంస్థలకు అప్పుగా ఇవ్వాలి. ఒక వేళ రివర్స్ రెపో రేటు ఎక్కువగా ఉంటే.. బ్యాంకులు ఆర్​బీఐ వద్ద జమ చేసేందుకే మొగ్గు చూపుతాయి. అందుకే.. రివర్స్ రెపో రేటును తక్కువగా ఉండేట్లు చూసుకుంటుంది ఆర్​బీఐ.

సామాన్యులపై ప్రభావం ఉంటుందా?

ఆర్​బీఐ రెపో రేటు తగ్గించినట్లయితే బ్యాంకులు తీసుకునే వడ్డీ రేటు కూడా తగ్గుతుంది. దీని వల్ల బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునే వ్యక్తులు, సంస్థలకు కూడా వడ్డీ భారం తగ్గుతుంది.

ఇంతకు ముందు ఇలా..

కొంత కాలం క్రితం వరకు ఆర్​బీఐ రెపో రేటు తగ్గించినప్పటికీ.. బ్యాంకులు మాత్రం రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేవి కావు. డిపాజిట్ రేట్లు తగ్గకపోవటమే దీనికి కారణమని బ్యాంకులు చెప్పేవి. అయితే ఎక్స్​టర్నల్ బెంచ్ మార్కులకు.. రిటైల్ రుణాల వడ్డీ రేట్లను అనుసంధానించాలని ఆర్​బీఐ కొన్నాళ్ల క్రితం వాణిజ్య బ్యాంకులకు సూచించింది. దీనితో తగ్గిన రెపో రేటు ఫలితాలను రుణ గ్రహీతలకు బదిలీ చేయడం ప్రారంభించాయి బ్యాంకులు.

అయితే ఇదే కారణం వల్ల ఫిక్స్​డ్​ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లు తగ్గుతుంటాయి. ఇది పెట్టుబడులు పెట్టే వారికి కాస్త ప్రతికూల అంశమే అని చెప్పొచ్చు.

ఇదీ చదవండి: కీలక వడ్డీ రేట్లు మరోసారి యథాతథమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.