ETV Bharat / business

సిరి: సిబిల్​ స్కోరు పెంచుకోండి ఇలా... - గృహ రుణం

చాలా మంది సొంత ఇల్లు, కారు... ఇలా ఎన్నో కావాలని కలలు కంటారు. అవి నెరవేరాలంటే చాలా డబ్బు అవసరం. అలా సొమ్ము లేనప్పుడు ముందుగా గుర్తొచ్చేది రుణ సౌకర్యం. మరి రుణం పొందాలంటే రుణ సంస్థలు పరిగణనలోకి తీసుకునే అంశాలు ఏంటి? మంచి రుణ గ్రహీతగా ఉండాలంటే ఏం చేయాలి?

రుణం పొందాలంటే?
author img

By

Published : Jun 2, 2019, 1:32 PM IST

అవసరమైనంత సొమ్ము దగ్గరలేకపోయినా.. కావాల్సిన వాటిని కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆశ్రయించే మార్గం అప్పు. రుణాలు కావాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే.

అన్నింటికి స్కోరే ముఖ్యం

CREDIT
స్కోరు ఉంటేనే రుణం

ఉద్యోగులకైనా, వ్యాపారులకైనా అప్పు ఇవ్వాలంటే రుణ సంస్థలు ముందుగా చూసేది రుణ గ్రహీత నేపథ్యం.

రుణ దరఖాస్తుదారు ఇంతకు ముందు తీసుకున్న రుణాల వివరాలు, వాటి చెల్లింపులు సక్రమంగా జరిపారా? రుణం తిరిగి చెల్లింపులో జాప్యం జరిగిందా? అనే విషయాలను తెలుసుకుంటాయి రుణసంస్థలు. ఇందుకోసం క్రెడిట్ ఇన్ఫర్​మేషన్​ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్​ (సిబిల్)​ను ఆశ్రయిస్తాయి.

రుణ గ్రహీత ఆర్థిక లావాదేవీల ఆధారంగా క్రెడిట్​ స్కోరును 300 నుంచి 900 వరకు నిర్ణయిస్తుంది సిబిల్​. ఈ స్కోరును బట్టి రుణాల మంజూరుపై నిర్ణయం తీసుకుంటాయి రుణ సంస్థలు. రుణ దరఖాస్తుదారు సిబిల్​ స్కోరు 900లకు ఎంత దగ్గరగా ఉంటే రుణాలు మంజూరయ్యే అవకాశం అంత ఎక్కువ.

అందుకే.. రుణానికి దరఖాస్తు చేసుకునే ముందు స్వయంగా సిబిల్​ స్కోర్​ నివేదికను తెప్పించుకోవాలి. క్రెడిట్​ స్కోరును బట్టి ఎంత మొత్తంలో రుణాలు మంజూరయ్యే అవకాశం ఉందో ముందుగానే లెక్కగట్టొచ్చు.

సిబిల్ ద్వారా తెలిసే మరిన్ని విషయాలు

  • మొత్తం ఎన్ని రుణాలు తీసుకున్నారు? ఇప్పటి వరకు పూర్తయినవి ఎన్ని?
  • రుణాలు ఎందుకోసం? (గృహ, వాహన ఇతరత్రా)
  • తనఖా పెట్టి తీసుకున్న రుణాలు.. క్రెడిట్ కార్డు వాడుతున్నారా?
  • ఉన్న మొత్తం రుణ భారం ఎంత? ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఏంటి?

మంచి రుణ గ్రహీత అవ్వాలంటే ఏం చేయాలి?

అధిక రుణం పొందినప్పటికంటే.. సకాలంలో వాటిని చెల్లించినప్పుడే మిమ్మల్ని మంచి రుణగ్రహీతగా గుర్తిస్తాయి రుణ సంస్థలు.

అదేపనిగా రుణాలు తీసుకుంటే?

CREDIT
అదే పనిగా రుణ దరఖాస్తు సరైంది కాదు

క్రెడిట్ స్కోరు బాగుందనో.. లేదా వేరే కారణాలతోనో అవసరం లేకపోయినా.. అదేపనిగా రుణాలు తీసుకోవడం సరైంది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే సిబిల్​ ఆధారంగా.. మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? అనే అంశాలను పరిగణించి కొత్త రుణాలు ఇచ్చేందుకు నిరాకరించవచ్చు రుణ సంస్థలు.

స్కోరు పెంచుకోండి ఇలా

క్రెడిట్ స్కోరు పెరగాలంటే ఈ విషయాలను గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు.

పాత రుణాల వాయిదాలను ఎప్పటికప్పడు సక్రమంగా చెల్లించాలి. అవసరాన్ని బట్టే రుణం తీసుకోవాలి. పాత రుణాల్లో ఎలాంటి వివాదం లేకుండా ముగించాలి. ముఖ్యంగా సరైన ఆర్థిక నియమాలను పాటించాలి.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.