ETV Bharat / business

ప్రభుత్వ ఆర్థిక విధానాలపై భాజపా నేత విమర్శలు

దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వానికి అధికార పార్టీ నేతల నుంచే చిక్కులు మొదలయ్యాయి. ప్రస్తుతం దేశంలో సరైన ఆర్థిక విధానాలు అమలు కావడం లేదని భాజపా నేత, మాజీ మంత్రి సుబ్రమణియన్​ స్వామి అన్నారు. దేశానికి ప్రస్తుతం ఏం కావాలో వాటిని చేకూర్చలేదని తెలిపారు.

సుబ్రమణియన్ స్మామి
author img

By

Published : Sep 29, 2019, 9:14 AM IST

Updated : Oct 2, 2019, 10:20 AM IST

ప్రభుత్వ ఆర్థిక విధానాలపై భాజపా నేత విమర్శలు

ఆర్థిక వ్యవస్థపై అధికార పార్టీ(భాజపా) నేత సుబ్రమణియన్​ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం సరైన ఆర్థిక విధానాలు పాటించడం లేదని ఆయన విమర్శించారు.

శనివారం ముంబయిలో జరిగిన విశ్వ హిందూ ఆర్థిక సదస్సు ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలుచేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మేక్​ ఇన్ ఇండియా లాంటి గొప్ప కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ.. స్థూల ఆర్థిక పాలసీల విషయంలో సరైన విధానాలు పాటించలేదని అన్నారు.

"మనం ఇప్పుడు సరైన ఆర్థిక విధానాలు పాటించట్లేదు.. ఇలా చెబుతున్నందుకు క్షమించండి."

- సుబ్రమణియన్​ స్వామి, మాజీ మంత్రి

దేశంలో సోవియట్​ ఆర్థిక విధానాలను పెట్టినందుకు.. భారత తొలి ప్రధాని జవహర్​లాల్ నెహ్రూని విమర్శించారు సుబ్రమణియన్​ స్వామి.
ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు వడ్డీ రేట్లు పెంచుతూ పోయారని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్​పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రుణాలపై వడ్డీ రేట్లు 9 శాతానికి మించకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు సుబ్రమణియన్​. ఫిక్సెడ్ డిపాజిట్​, సేవింగ్స్ ఖాతాలు 9 శాతం వడ్డీని పొందేలా చూడాలన్నారు.

ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న దేశానికి వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అంతగా అవసరం లేదని అన్నారు. పొదుపును పెంచేందుకు ఆదాయపు పన్నును రద్దు చేయాలని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కాంగ్రెస్​ నూతన ఐటీ చీఫ్​గా రోహన్​ గుప్తా

New Delhi, Sep 28 (ANI): Prime Minister Narendra Modi arrived in New Delhi after week-long visit to attend UNGA Summit. After his arrival he said, "I want to thank you all for coming in large numbers. This has been a memorable welcome back home. On this occasion, I bow to each and every Indian."
Last Updated : Oct 2, 2019, 10:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.