భారత్ సరైన సమయంలో లాక్‌డౌన్ విధించడం వల్ల కరోనా తీవ్ర స్థాయి విజృంభణను అడ్డుకోగలగిందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్ పేర్కొన్నారు. 2020-21 ఆర్థిక సర్వేను డిజిటల్ మాధ్యమంలో విడుదల చేసిన ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
ఈ ఆర్థిక సర్వేను కొవిడ్ యోధులకు అంకితమిస్తున్నట్లు.. తెలిపారు. ఈ సందర్భంగా ఆర్థిక సర్వేకు సంబంధించిన ప్రత్యేక యాప్‌ను విడుదల చేశారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే మళ్లీ కోలుకుంటుంది గానీ, ప్రజల ప్రాణాలు కోల్పోతే తిరిగి తీసుకురాలేమన్న ఉద్దేశంతో ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించినట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన లాక్‌డౌన్ వల్ల 37 లక్షల కేసులు తగ్గించగలిగామని, లక్ష ప్రాణాలను కాపాడగలిగామని పేర్కొన్నారు.
లాక్‌డౌన్ లేకున్నా.. కరనా వల్ల ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా కుదేలయ్యేదని తెలిపారు సుబ్రమణియన్.
ఇదీ చూడండి:'వచ్చే రెండేళ్లలో దేశార్థికం పరుగులు'