ETV Bharat / business

అమెరికా నుంచి భారత్​కు ఎఫ్​డీఐల జోరు - US Investments in India in h1

భారత్​లో అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెట్టిన దేశాల జాబితాలో అమెరికా రెండో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 7.12 బిలియన్​ డాలర్ల ఎఫ్​డీఐలతో ఈ స్థానాన్ని దక్కించుకుంది అమెరికా. ఈ జాబితాలో సింగపూర్​ అగ్ర స్థానంలో కొనసాగింది.

America Rank in India FDI Source
భారత్​లో అమెరికా పెట్టిన పెట్టుబడులు
author img

By

Published : Nov 29, 2020, 5:12 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగం (ఏప్రిల్​-సెప్టెంబర్)లో భారత్​ అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్​డీఐ) ఆకర్షించిన రెండో అతిపెద్ద దేశంగా అమెరికా నిలిచింది.

ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య అమెరికా నుంచి భారత్ 7.12 బిలియన్ డాలర్ల ఎఫ్​డీఐలను పొందింది. గత ఏడాది ఇదే సమయంలో రెండో స్థానంలో ఉన్న.. మారిషస్​ నుంచి ఈ సారి 2 బిలియన్​ డాలర్ల ఎఫ్​డీఐలు మాత్రమే వచ్చాయి. దీనితో మారిషస్​ 4వ స్థానానికి పడిపోయింది.

డిపార్ట్​మెంట్​ ఫర్ ప్రమోషన్​ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం తెలిసింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలోనూ 8.30 బిలియన్ డాలర్ల ఎఫ్​డీఐతో సింగపూర్ ఆగ్రస్థానంలో కొనసాగింది. కేమన్ ఐలాండ్​ 2.1 బిలియన్ డాలర్ల ఎఫ్​డీఐలు పెట్టి మూడో స్థానంలో నిలిచింది.

దేశాల వారీగా ఎఫ్​డీఐలు..

  • నెదర్లాండ్స్- 1.5 బిలియన్ డాలర్లు
  • బ్రిటన్- 1.35 బిలియన్ డాలర్లు
  • ఫ్రాన్స్- 1.13 బిలియన్​ డాలర్లు
  • జపాన్- 653 మిలియన్​ డాలర్లు
  • జర్మనీ- 202 మిలియన్ డాలర్లు
  • సైప్రస్- 48 మిలియన్ డాలర్లు

ఇదీ చూడండి:'రైతులకు సాగు చట్టాలు అర్థం కాలేదు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.