ETV Bharat / business

పన్ను ఆదాకు.. ఫండ్ల మార్గం.. - పన్ను ఆదాయ చేసే ఆర్థిక ప్రణాళిక

ఈ నెలతో 2020-21 ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. పన్ను ఆదా కోసం పెట్టుబడులు పెట్టాలనుకుంటే మార్చి 31 చివరి తేదీ. సమయం తక్కువగా ఉంది కాబట్టి.. ఇప్పుడు ఎలాంటి పథకాలు ఎంచుకుంటే పన్ను ఆదాతో పాటు పెట్టుబడుల ప్రతి ఫలాలు కూడా బాగుంటాయి అనే వివరాలు మీ కోసం.

best tax saving schemes
పన్ను ఆదాకు ఉత్తమ పెట్టుబడులు
author img

By

Published : Mar 26, 2021, 2:43 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కొన్ని రోజుల్లో ముగియనుంది. ఇప్పటికీ పన్ను ఆదా కోసం పెట్టుబడులు పెట్టని వారు.. మార్చి 31లోగా ఆ ప్రక్రియను ముగించాలి. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే వారు ఏ పథకాలను ఎంచుకోవాలనే సందేహంలో ఉంటారు. ఒకవైపు మార్కెట్‌లో పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ.. మరోవైపు పన్ను ఆదాకు ఉపయోపగపడే ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల (ఈఎల్‌ఎస్‌ఎస్‌)కు ఇప్పుడు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా యువతకు ఇవి ఎంతో అనుకూలంగా ఉంటాయని చెప్పొచ్చు.

ఎందుకు?

సెక్షన్‌ 80సీలో భాగంగా రూ.1,50,000 వరకూ వివిధ పథకాల్లో మదుపు చేయొచ్చు. మ్యూచువల్‌ ఫండ్లలోని ఈఎల్‌ఎస్‌ఎస్‌లలో చేసిన మదుపునూ ఇందులో చూపించుకోవచ్చు. మ్యూచువల్‌ ఫండ్లలో దీర్ఘకాలిక దృష్టితో మదుపు చేసే వారు.. తమ పన్ను ప్రణాళికలో భాగంగా వీటిని ఎంచుకోవచ్చు.

రాబడి విషయంలో..

పెట్టుబడులకు సరైన ప్రతిఫలం ఉండాలని కోరుకుంటారందరూ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సురక్షిత పథకాల నుంచి కనీసం 12-15శాతం రాబడి రావడం ఆశించలేం. చరిత్రను పరిశీలిస్తే.. ఈఎల్‌ఎస్‌ఎస్‌లు మంచి రాబడినే అందించాయి. అందుకే, చివరి నిమిషంలో పన్ను ఆదా చేసుకోవాలనుకునే వారు.. వీటిని పరిశీలించవచ్చు.

తక్కువ వ్యవధితో

ప్రస్తుతం సెక్షన్‌ 80సీకి అర్హత ఉన్న పెట్టుబడుల్లో అతి తక్కువ వ్యవధి ఉన్నవి ఈఎల్‌ఎస్‌ఎస్‌లే. వీటిలో పెట్టుబడిని కనీసం మూడేళ్లపాటు కొనసాగిస్తే చాలు. పన్ను ఆదా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను 5 ఏళ్లు, పీపీఎఫ్‌ను 15 ఏళ్లు కొనసాగించాలి. కొన్ని పథకాలను ఎంచుకుంటే.. ఏటా అందులో మదుపు చేయాల్సి ఉంటుంది. ఈఎల్‌ఎస్‌ఎస్‌తో ఆ చిక్కులు ఉండవు. మూడేళ్ల తర్వాత పెట్టుబడి మొత్తాన్ని వెనక్కి తీసుకొని, దాన్ని తిరిగి మదుపు చేసే అవకాశమూ ఉంటుంది.

క్రమం తప్పకుండా..

ఒకేసారి మొత్తం పెట్టుబడి పెట్టక్కర్లేకుండా.. క్రమానుగత పెట్టుబడి విధానంలోనూ మదుపు చేసే అవకాశాన్ని కల్పిస్తాయివి. ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే వీటిలో మదుపు చేస్తూ వెళ్తే.. చివరి నిమిషంలో ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు.. మీ దగ్గర పెద్ద మొత్తం ఉన్నప్పుడు దాన్ని లిక్విడ్‌ ఫండ్లలో మదుపు చేసి, తర్వాత వీటిలోకి క్రమానుగతంగా బదిలీ చేసుకోవచ్చు.

ఇదీ చదవండి:మార్కెట్​ ఆటుపోట్లను అర్థం చేసుకోండిలా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.