ETV Bharat / business

ప్రీమియం పెరిగింది.. మరి జీవిత బీమా తీసుకోవాలా? - కరోనా కాలంలో జీవిత బీమా అవసరం

జీవిత బీమా.. కుటుంబ యజమాని ఏదైనా ప్రమాదం వల్ల మరణిస్తే.. ఇతర సభ్యులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా అండగా ఉంటుంది. కరోనాతో ఇటీవల వీటిని తీసుకునే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఇదే సమయంలో బీమా ప్రీమియంను కూడా పెంచాయి ఆయా కంపెనీలు. మరి ఇలాంటి పరిస్థితుల్లో బీమా తీసుకోవడం సరైందేనా? ఒకవేళ తీసుకుంటే ఎలాంటి అంశాలు పరిగణించాలి? ఈ విషయాలన్నింటికి నిపుణుల విశ్లేషణలు మీ కోసం.

life insurance use in corona times
కరోనా కాలంలో జీవిత బీమా అవసరం
author img

By

Published : Aug 2, 2020, 2:05 PM IST

గతంలో ఎన్నడూ లేనంతగా.. ప్రజల్లో ఇటీవల ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులు ఇందుకు ప్రధాన కారణం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వల్ల ప్రమాదం మాత్రం తగ్గడం లేదు. ఈ మహమ్మారి ఎప్పుడు.. ఎవరికి, ఎలా సోకుతుందో అనే భయాలు నెలకొన్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వల్ల ఏదైనా జరగరానిది జరిగినా.. తమపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చాలా మంది జీవిత బీమా తీసుకుంటున్నారు. గతంతో పోలిస్తే.. కరోనా నేపథ్యంలో జీవిత బీమా తీసుకునే వారి సంఖ్య భారీగా పెరిగినట్లు మ్యాక్స్‌ లైఫ్‌ ఇండియా చేసిన ఓ సర్వేలో తెలిసింది.

బీమా ఉంటే ధీమా..

మన మీద ఆధారపడి ఉండే కుటుంబానికి మనం లేని సమయంలో కూడా ధీమానిచ్చేదే జీవిత బీమా. కుటుంబం మొత్తం ఆధారపడే వ్యక్తి మరణిస్తే.. కుటుంబ సభ్యులు ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా.. ఎక్కువ విలువున్న టర్మ్‌ పాలసీలు ధీమా ఇస్తాయి.

పాలసీదారుడు మరణించినట్లైతే.. ముందే నిర్ణయించిన మొత్తాన్ని అందిస్తాయి ఈ టర్మ్ పాలసీలు. ఇవి రక్షణాత్మకమైనవి మాత్రమే. ఈ పాలసీల ప్రీమియం సాధారణంగా అందుబాటు ధరల్లో ఉంటుంది. అయితే కొవిడ్‌ మూలంగా పరిస్థితి అనిశ్చితిగా మారటం వల్ల ప్రీమియం ధరలు పెరిగాయి.

కరోనా భయాలే కారణం..

కరోనా సహా, ఇతర సమస్యలతో మరణాలు రేటు ఇటీవల భారీగా పెరగటం వల్ల పాలసీల ప్రీమియం పైపైకి వెళ్తున్నట్లు బీమా కంపెనీలు చెబుతున్నాయి. అయినప్పటికీ చాలా మంది జీవిత బీమాపై ఆసక్తి చూపుతుండటం గమనార్హం.

మ్యాక్స్‌ లైఫ్‌ ఇండియా సర్వేలో పాల్గొన్నవారిలో 41 శాతం మంది కొవిడ్‌ భయాలతోనే టర్మ్ పాలసీ తీసుకోవాలనుకుంటున్నట్లు తెలపడం గమనార్హం.

ప్రీమియం ధరలు ఎందుకు పెరిగాయ్​?

టర్మ్ పాలసీలకు సంబంధించి మరణాల రేటు, క్లెయిమ్‌ల అంచనా ఆధారంగా ప్రీమియం నిర్ణయిస్తాయి బీమా కంపెనీలు. క్లెయిమ్​ల వాస్తవ సంఖ్య, క్లెయిమ్​ అంచనాల మధ్య ఎక్కువ తేడాలుంటే.. పాలసీల ప్రీమియం ఎక్కువగా ఉంటుందని బీమా నిపుణులు అంటున్నారు.

బీమా రీఇన్సూరెన్స్ కంపెనీల అంచనాల కన్నా మరణాల రేటు ఎక్కువగా ఉంటే.. అప్పుడు కూడా ప్రీమియం పెరుగుతుందని వారు చెబుతున్నారు. బీమా కంపెనీలకూ బీమానిచ్చే సంస్థలే ఈ రీ ఇన్సూరెన్స్ సంస్థలు.

కొన్ని సంవత్సరాలుగా మరణాలకు సంబంధించి క్లెయిమ్‌ల సంఖ్య పెరిగింది. అంచనాల కన్నా ఎక్కువ క్లెయిమ్​లు జరగటం వల్ల రీఇన్సూరెన్స్ కంపెనీలు ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వడ్డీ రేట్లు భారీగా పడిపోవడం వల్ల కూడా ప్రీమియం పెంపు తప్పడం లేదని అంటున్నారు.

ఎలాంటి బీమా తీసుకోవాలి?

ప్రజల్లో అవగాహన పెరిగిన మూలంగా జీవిత బీమాకు డిమాండ్‌ తగ్గే అవకాశం లేదని బీమా రంగ ప్రతినిధులు అంచనా వేస్తున్నారు. అయితే బీమా తీసుకునే వారు తమ అవసరాలకు తగ్గట్లు పాలసీలను ఎలా ఎంపిక చేసుకోవాలనే విషయంపై కొన్ని కీలక సూచనలు చేస్తున్నారు.

కనీసం సాధారణ రిటైర్మెంట్‌ వయస్సు 60 వరకు కవరేజీ ఇచ్చే విధంగా టర్మ్ పాలసీ ఉండాలని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ప్రీమియం పెరిగిందని టర్మ్‌ పాలసీ తీసుకోకుండా ఉండకూడదని వారు సూచిస్తున్నారు. క్లెయిమ్‌, సెటిల్‌మెంట్‌ నిష్పత్తి ఎక్కువగా ఎందులో ఉంటే ఆ కంపెనీలో బీమా తీసుకోవాలని అంటున్నారు. పాలసీదారు వార్షిక ఆదాయం కన్నా.. 10 రెట్లు అధిక విలువ ఉన్న టర్మ్​ పాలసీలు ఉత్తమమైన ఎంపికగా చెబుతున్నారు.

ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్​: ఏళ్ల తరబడి వృద్ధి.. వారాల్లో ఉఫ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.