ETV Bharat / business

క్రెడిట్​ కార్డు వినియోగంలో ఈ విషయాలు గుర్తుంచుకోండి..

ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం బాగా పెరిగిపోయింది. క్రెడిట్ కార్డు ఉంది కదా అని వాడేసి.. తర్వత తిరిగి చెల్లించలేక చాలా మంది అప్పుల్లో చిక్కుకుంటుంటారు. మరి అలా జరగకుండా క్రెడిట్ కార్డు వాడకంలో పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు మీకోసం.

క్రెడిట్​ కార్డు వినియోగంలో ఈ విషయాలు గుర్తుంచుకోండి..
author img

By

Published : Oct 5, 2019, 6:01 AM IST

నగదు రహిత చెల్లింపులకు పెరిగిన ఆదరణతో చాలామంది క్రెడిట్‌ కార్డులను వాడటం ప్రారంభించారు. అయితే, కార్డు వాడే విధానంలో కొన్ని మార్పులు చేసుకోకపోతే.. మీ క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం పడే అవకాశం ఉంది. కొన్ని జాగ్రత్తలతో అప్పుల వూబిలో కూరుకుపోకుండా.. క్రెడిట్‌ స్కోరు దెబ్బతినకుండా చూసుకోవచ్చు. మరి ఆ మార్గాలేంటో తెలుసుకోండి.

కార్డు వినియోగంలో ఈ తప్పులొద్దు..

క్రెడిట్‌ కార్డును ఉపయోగించడమే కాదు.. వ్యవధిలోపు దాని బిల్లును తీర్చేయడమూ ముఖ్యమే. చాలామంది సమయానికి బిల్లులు చెల్లించక, పెద్ద మొత్తంలో కొనుగోలు చేసినప్పుడు దానిని ఈఎంఐగా మార్చుకోవడంలాంటివి చేస్తుంటారు. కార్డు వినియోగంలో చేయకూడని తప్పులివి. కాబట్టి, ముందుగా జాగ్రత్త పడాల్సింది ఈ విషయంలోనే.

ఇబ్బంది అనిపిస్తే ఖర్చు వాయిదానే మేలు..

బిల్లు తప్పకుండా చెల్లిస్తామనే నమ్మకం ఉంటేనే పెద్ద లావాదేవీలు చేయండి. ఇబ్బందిగా ఉండొచ్చు అని ఏమాత్రం అనిపించినా మీ ఖర్చును వాయిదా వేసుకోవడమే ఉత్తమం. ఇప్పుడు ఖర్చు చేసి, తర్వాత చూసుకుందాం అనే మాట ఇక్కడ పనికిరాదని గుర్తించండి.

సాధారణంగా మీ కార్డు పరిమితిలో 30శాతానికి మించి వాడకుండా చూసుకోండి. పరిమితి ఉంది కదా అని పూర్తిగా వాడటం అంటే.. మీరు అప్పుల మీదే ఆధారపడ్డారనే సంకేతాలు వెళ్తాయి. భవిష్యత్తులో మీరేదైనా రుణం తీసుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇది ఇబ్బందికరంగా మారవచ్చు.

మీరు గతంలో ఎప్పుడో కార్డు తీసుకొని ఉంటారు.. రుణ పరిమితి అప్పుడు చాలా తక్కువగా ఉండొచ్చు. పెరిగిన అవసరాల మేరకు కార్డు రుణ పరిమితిని పెంచుకోండి. దీనికోసం మీ కార్డు సంస్థను సంప్రదించండి. ఇది ఎందుకు అనే అనుమానం రావచ్చు.. అధికంగా పరిమితి ఉంటే లాభమే కానీ నష్టం లేదు.

రెండు కార్డులుంటే ఇలా చేయండి..

రెండు క్రెడిట్‌ కార్డులు ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకూ రెండింటినీ సమానంగా వాడేందుకు ప్రయత్నించండి. ఒకటి పూర్తిగా పరిమితి వరకూ వాడేసి, మరోదాన్ని అసలు వాడకపోవడం సరికాదు. రెండు కార్డుల్లో రూ.50వేల పరిమితి ఉంటే.. మీరు రూ.40వేలు వాడాలనుకున్నప్పుడు.. రెండు కార్డుల నుంచీ రూ.20వేల చొప్పున వాడటం ఉత్తమం.

రుణ చరిత్రను తెలుసుకోండి..

క్రెడిట్‌ కార్డులు, ఇతర రుణాలు ఉన్నప్పుడు కనీసం ఏడాదికోసారైనా మీ క్రెడిట్‌ స్కోరు, రుణ చరిత్ర నివేదికను పొందడం మంచిది. ఇప్పుడు ఏడాదికోసారి రుణ చరిత్రను ఉచితంగా పొందే అవకాశమూ ఉంది. దీనికోసం సిబిల్‌ వెబ్‌సైటులోకి వెళ్లి, మీ వివరాలు పూర్తి ఇస్తే చాలు.

రుణ చరిత్ర సరిగ్గా లేకపోవడం, క్రెడిట్‌ స్కోరు 750కన్నా తక్కువగా ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాంకులను సంప్రదించి, పాత బాకీలను తీర్చేయడమే ఉత్తమం. దీనివల్ల భవిష్యత్తులో అనవసర ఇబ్బందులు తప్పుతాయి.

ఇదీ చూడండి: దటీజ్ మారుతి... సంక్షోభంలోనూ సూపర్​ హిట్​!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan. Max use 3 minutes per match. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Panasonic stadium, Osaka, Japan - 4th October 2019
Gamba Osaka (Blue) vs Consadole Sapporo (White)
1. 00:00 Teams walkout
2. 00:07 Gamba Osaka fans
First Half
3. 00:11 PENALTY GAMBA - Referee points to the spot after Ademilson was fouled in the box on seven minutes
4. 00:26 Replay of foul
5. 00:31 PENALTY MISS GAMBA - Ademilson fails to score from the spot in the eighth minute
Second Half
6. 00:43 GOAL GAMBA - Shu Kurata scores on 57 minutes, 1-0 Gamba Osaka
7. 01:00 GOAL GAMBA - Takashi Usami scores on 61 minutes, 2-0 Gamba Osaka
8. 01:20 Replays of Takashi Usami's goal
9. 01:28 GOAL GAMBA - Ademilson scores with the header on 70 minutes, 3-0 Gamba Osaka
10. 01:45 GOAL GAMBA - Hiroki Fujiharu scores in the 88th minute, 4-0 Gamba Osaka
11. 02:00 GOAL GAMBA - Kazuma Watanabe scores on 90+2 minutes from distance, 5-0 Gamba Osaka
12. 02:15 Replays of Kazuma Watanabe's goal  
SOURCE: Lagardere Sports
DURATION: 02:26
STORYLINE:
Consadole Sapporo's hopes of qualifying for next year's AFC Champions League took a battering on Friday night after they were crushed 5-0 away by Gamba Osaka.
Gamba had a chance to take the lead as early as the eighth minute only for Ademilson to waste it from twelve yards out.
Following a goalless first half, Gamba raised their game and got the breakthrough on 57 minutes through Shu Kurata.
Takashi Usami then doubled their advantage four minutes later before Ademilson made amends for the penalty miss with a goal on 70 minutes.
Hiroki Fujiharu and Kazuma Watanabe rounded off a fruitful outing for the home side.
The result meant Consadole are stuck on 40 points in seventh place, nine behind third place Yokohama F-Marinos with six matches remaining.
For Gamba, they moved up to 11th place on 34 points, six above the relegation zone.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.