ETV Bharat / business

మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడా? ఇవి తెలుసుకోండి.. - మ్యూచువల్ ఫండ్లకు సిప్ మంచిదేనా

పెట్టుబడి సాధానాల్లో చాలా మంది మ్యూచువల్‌ ఫండ్లను ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. మ్యూచువల్ ఫండ్లలో సిప్‌, లంప్‌సమ్‌ పద్ధతుల్లో పెట్టుబడి పెట్టేందుకు వీలుంది. ఈ రెండు పద్ధతుల మధ్య తేడా ఏమిటి? రెండింటిలో ఏది ఉపయోగకరంగా ఉంటుంది? మీ ఆర్థిక పరిస్థితులకు ఏది సరిపోతుంది? అనే విషయాలు వివరంగా మీకోసం.

Which  is best for mutual fund investments
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులకు ఏ పద్ధతి ఉత్తమం
author img

By

Published : Sep 6, 2020, 1:03 PM IST

తక్కువ రిస్క్​తో పెట్టుబడికి అనేక మార్గాలున్నాయి. అందులో మ్యూచువల్‌ ఫండ్లు ముఖ్యమైనవి. మ్యూచువల్‌ ఫండ్లలో కూడా ఒకేసారి పెద్ద మొత్తంలో లేదా వాయిదాల్లో పెట్టుబడి పెట్టే వీలుంది.

వాయిదాల్లో పెట్టుబడి పెట్టటాన్ని 'సిస్టమెటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్)' అంటారు. పెద్ద మొత్తంలో ఒకేసారి పెట్టే పెట్టుబడిని 'లంప్ ‌సమ్‌' ఇన్వెస్ట్‌మెంట్‌ అంటారు. ఈ రెండు పద్ధతుల్లోనూ మదుపరులు మంచి రిటర్నులు పొందొచ్చు. పెట్టుబడి పెట్టే విధానంలో మాత్రమే ఈ రెండింటి మధ్య ప్రధాన తేడా. వీటితో పాటు లంప్​ సమ్​, సిప్​ ద్వారా పెట్టే పెట్టుబడులపై పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సిప్ ద్వారా పెట్టుబడులు ఇలా..

సిప్‌ ద్వారా అయితే తరచూ విడతల వారీగా పెట్టుబడి పెట్టుకోవచ్చు. రోజు, వారం, నెల, త్రైమాసికం, అర్ధ వార్షికాల వారీగా వాయిదాను ఎంచుకోవచ్చు. వీటిలో అత్యల్పంగా రూ.500 కనీస మొత్తంతో కూడా పెట్టుబడి ప్రారంభించవచ్చు. మ్యూచువల్‌ ఫండ్‌ను బట్టి కనీస పెట్టుబడి మొత్తం మారుతుంటుంది.

ఒకేసారి పెట్టుబడి పెట్టడం కష్టమైనప్పుడు.. వాయిదాల్లో చెల్లించగలం అనుకునే వారు సిప్​ ద్వారా పెట్టుబడి పెట్టుకోవచ్చు. తక్కువ మొత్తంలో తరచూ పెట్టుబడికి డబ్బులు అందుబాటులో ఉన్నా కూడా సిప్‌ను ఎంచుకోవచ్చు.

ఎక్కువ రిస్కు తీసుకునేందుకు సిద్ధంగా ఉండి, పెట్టుబడికి కావాల్సినంత డబ్బు ఉంది అనుకుంటే లంప్‌ సమ్‌ పద్ధతిలో పెట్టుబడి పెట్టవచ్చు. దీనిలో కూడా కనీస పెట్టుబడి ఫండ్‌ను బట్టి మారుతుంది.

రెండు పద్ధతుల్లో వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని పెట్టుబడి పెట్టాలని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఆ విషయాలేమిటంటే..

మార్కెట్‌ పరిస్థితులపై అవగాహన

ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతున్నట్లయితే మార్కెట్‌ పరిస్థితులపై ఎక్కువ అవగాహన ఉండాల్సి ఉంటుంది. మార్కెట్లు దిగువ స్థాయిలో ట్రేడ్‌ అవుతున్నప్పుడు ఒకేసారి పెట్టుబడి పెట్టటం వల్ల ఎక్కువ లాభాలను గడించవచ్చు.

సిప్‌ ద్వారా అయితే.. వివిధ మార్కెట్‌ పరిస్థితుల్లో పెట్టుబడి పెడతాం. లంప్‌ సమ్‌ పద్ధతితో పోల్చితే సిప్‌ ద్వారా పెట్టుబడికి మార్కెట్‌పై ఎక్కువ అవగాహన అవసరం లేదు.

తక్కువ వద్ద కొనటం, ఎక్కువ వద్ద విక్రయించటం ద్వారా లంప్‌సమ్‌ పద్ధతిలో లాభాలను గడించవచ్చు. మార్కెట్లు మంచి స్థాయిలో ట్రేడ్‌ అవుతున్నప్పుడు ఒకేసారి పెట్టుబడి పెట్టినట్లైతే నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల మరోసారి పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపకపోవచ్చు. లంప్‌సమ్‌లో దీర్ఘకాలం(5 నుంచి 10 సంవత్సరాలు) పెట్టుబడి పెట్టినట్లైతే మంచి రిటర్న్‌లను పొందవచ్చు అని విశ్లేషకులు చెబుతున్నారు.

సరాసరి..

సిప్‌లో వివిధ మార్కెట్‌ పరిస్థితుల్లో పెట్టుబడి పెడతాం కాబట్టి పెట్టుబడుల సరాసరిపై అన్నింటి ప్రభావం ఉంటుంది. మార్కెట్లు దిగువ స్థాయిలో ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్లు కొనుగోలు చేస్తాం. ఎగువ స్థాయిలో ఉంటే తక్కువ యూనిట్లు కొనుగోలు చేస్తాం. కాబట్టి వాటి సరాసరి తగ్గి మార్కెట్‌ పరిస్థితుల ప్రభావం తక్కువగా ఉంటుంది. మార్కెట్ల మంచి ప్రదర్శన కనబరుస్తున్నప్పుడు దిగువ స్థాయిలో కొన్న యూనిట్లను విక్రయించుకోవచ్చు.

కాంపౌండింగ్‌ ప్రభావం

సిప్‌ పెట్టుబడుల్లో లాభాలను తిరిగి అదే ఫండ్‌లో పెట్టుబడి పెడతారు. దీన్నే కాంపౌండింగ్‌ అంటారు. దీనివల్ల ఎక్కువ లాభాలు వస్తాయి. సిప్‌ ద్వారా అయితే తరచూ పెట్టుబడి పెడతాం కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతుంది. ఆటోమేటిగ్​గా మీ బ్యాంకు ఖాతా నుంచి సిప్​ పెట్టుబడి నెలనెలా కొంత మొత్తం కెటాయించేందుకు వీలుంది.

ఎంపిక ఎలా?

మ్యూచువల్​ ఫండ్లకోసం సిప్‌, లంప్‌ సమ్‌ రెండింటిలో ఏది ఉత్తమం అనేది వ్యక్తిగత ఆర్థిక అవసరాలు, సామర్థ్యాలనుబట్టి నిర్ణయించుకోవాలి అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఆదాయం, ఆర్థిక స్థిరత్వం, పెట్టుబడి లక్ష్యాలు, రిస్కు తీసుకునే సామర్థ్యం ఆధారంగా తమకు ఏది సరిపోతుందో అది ఎంచుకోవాల్సి ఉంటుందని వారు అంటున్నారు.

ఇదీ చూడండి:మారటోరియం ఈఎంఐల భారం తగ్గాలంటే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.