ETV Bharat / business

గడువులోపు ఆ పని చేయకుంటే మీ ఎస్​బీఐ అకౌంట్ క్లోజ్​! - పాన్​ ఆధార్ లింక్​ ఎలా

మీకు ఎస్​బీఐలో ఖాతా ఉందా? అయితే ఈ వార్త మీకోసమే. ఖాతాదారులంతా.. సెప్టెంబర్ 30 లోపు పాన్​-ఆధార్​ అనుసంధానం పూర్తి చేయాలని స్పష్టం చేసింది ఎస్​బీఐ. లేదంటే బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని హెచ్చరించింది. ఎస్​బీఐ ప్రకటన పూర్తి వివరాలు మీకోసం.

SBI alert on Pan Aadhar link
ఎస్​బీఐ
author img

By

Published : Aug 10, 2021, 1:21 PM IST

Updated : Aug 10, 2021, 2:50 PM IST

ప్రభుత్వ రంగ, అతి పెద్ద బ్యాంక్​​ ఎస్​బీఐ.. తమ ఖాతాదారులకు కీలక సూచనలు జారీ చేసింది. సెప్టెంబర్​ 30లోపు పాన్-ఆధార్​​ అనుసంధానం పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అప్పటిలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయకుంటే.. బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వెల్లడించింది.

ముఖ్యంగా పాన్​ ఇన్​యాక్టవ్​గా మారుతుందని.. ఫలితంగా నగదు​ లావాదేవీలు జరపడంలో ఇబ్బందులు తలెత్తుతాయని వివరించింది ఎస్​బీఐ.

ఇన్​కం ట్యాక్స్​ చట్టం 1961 సెక్షన్​ 139ఏఏ ప్రకారం.. భారతీయ పౌరులు ఎవరికైతే పాన్​ కార్డ్ ఉంటుందో​ వారంతా.. తమ ఆధార్​ వివరాలు ఆదాయాపు పన్ను శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. రెండేళ్లకు ముందే ఆదాయపు శాఖ.. ఈ దీనిని తప్పని సరి చేసినప్పటికీ కరోనా సహా పలు ఇతర కారణాలతో ఇందుకు గడువు పెంచుతూ వచ్చింది.

పాన్-ఆధార్​​ లింక్ చేయడం ఎలా?

  • ఆదాయపన్ను శాఖ నూతన ఈ-ఫైలింగ్‌ పోర్టల్ లేదా ఎస్ఎంఎస్‌ సాయంతో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవచ్చు.
  • ఆదాయపు పన్ను శాఖ కొత్త వెబ్​సైట్‌లో 'Link Aadhaar' విభాగంలో ఇది లభిస్తుంది. పాన్‌, ఆధార్ నెంబ‌ర్లు.. ఆధార్ కార్డు ప్ర‌కారం పేరు వంటి వివ‌రాల‌ను పొందుప‌ర‌చాల్పి ఉంటుంది. ఆధార్​తో అనుసంధానమైన మొబైల్‌కి ఓటీపీ వ‌స్తుంది. దీని ద్వారా ప్రమాణీకరణ పూర్తి అవుతుంది.
  • ఎస్​ఎంఎస్​ ద్వారా అయితే.. 567678/56161కు UIDPAN<12-digit Aadhaar> <10-digit PAN> అని మెసేజ్‌ చేయాలి.
  • పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించేందుకు ఈ రెండింటిలోనూ.. మీ పేరు, పుట్టిన తేదీ, జెండ‌ర్ వంటి వివ‌రాలు ఒకేలా ఉండాలి.
  • ఒక‌వేళ ఆధార్ డేటాలో ఉన్న పేరుకు మీరు ఇచ్చిన పేరుకు మ‌ధ్య చిన్న వ్య‌త్యాసం ఉన్నా ఆధార్ రిజిస్ట‌ర్ మొబైల్ నెంబ‌రుకు ఓటీపీ వ‌స్తుంది.
  • ఒకవేళ ఆధార్ కార్డులోని పేరుకు, పాన్ నెంబ‌రులోని పేరు పూర్తిగా వేరుగా ఉంటే అనుసంధానం కాదు. ఏ కార్డులో త‌ప్పుగా పేరు న‌మోదు అయ్యిందో ఆ కార్డును స‌రిచేసుకుని అప్పుడు అనుసంధానించాలి.

ఇవీ చదవండి:

Last Updated : Aug 10, 2021, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.