ETV Bharat / business

పద్దు 2020: వేతన జీవుల జేబులోకి మరింత డబ్బు! - వేతన జీవులకు ఊరట

వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది మోదీ 2.0 సర్కారు. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మందగమనం పరిస్థితుల నేపథ్యంలో రానున్న బడ్జెట్​లో వేతన జీవులకు భారీ ఊరట ఉండొచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ అంశంపై విశ్లేషకులు ఏమంటున్నారు?

budget
వేతన జీవులకు ఊరట
author img

By

Published : Jan 25, 2020, 8:03 AM IST

Updated : Feb 18, 2020, 8:08 AM IST

రాబోయే బడ్జెట్‌లో కేంద్రం వేతన జీవులకు ప్రోత్సాహకాలు అందించే అవకాశం ఉంది. ఇప్పటికే తగ్గిన గిరాకీని పెంచేందుకోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని విశ్లేషకులు అంచనాలు కడుతున్నారు. వేతనజీవుల జేబుల్లోకి మరింత డబ్బులొస్తే అది వినియోగాన్ని పెంచి, గిరాకీ చక్రాన్ని గిర్రున తిప్పుతుందన్న ఆశలు ఉన్నాయి.

80సీ పరిమితి 2.5 లక్షలకు..

80సి కింద పన్ను మినహాయింపును రూ.2.5 లక్షలకు పెంచొచ్చు. ప్రస్తుతం ఆదాయ పన్ను(ఐటీ) చట్టంలోని సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో పీపీఎఫ్‌, ఎన్‌ఎస్‌సీలు కలిసే ఉన్నాయి.

పీపీఎఫ్‌ పెట్టుబడుల పరిమితి పెంపు

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(పీపీఎఫ్‌) మదుపర్లకు గరిష్ఠ పెట్టుబడుల పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచవచ్చు. ప్రస్తుతం ఈ పరిమితి రూ.1.5 లక్షలుగా ఉంది. ఒక వేళ బడ్జెట్లో ఈ నిర్ణయం తీసుకుంటే రూ.5 లక్షల స్థూల ఆదాయం ఉన్న 3 కోట్ల మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లకు ఊరట లభిస్తుంది.

ప్రత్యేక విభాగంలో ఎన్‌ఎస్‌సీ

80సి కింద ప్రత్యేక విభాగంలో నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌(ఎన్‌ఎస్‌సీ)లకు రూ.50,000 వరకు పన్ను మినహాయింపు ఇచ్చే అవకాశం.

తగ్గుతున్న ఆదా..

గత కొన్నేళ్లుగా ఆదా చేసే శక్తి తగ్గుతోంది. 2011-12లో జీడీపీలో 23.6 శాతం మేర భారత గృహస్థులు ఆదా చేయగా.. 2017-18 నాటికి ఆ సేవింగ్స్‌ రేటు కాస్తా 17.2 శాతానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో పై చర్యలు చేపడితే పరిస్థితిలో మార్పులు తీసుకురావొచ్చన్నది విశ్లేషకుల మాటగా ఉంది.
కొసమెరుపు: ప్రభుత్వం ఇప్పటికే కార్పొరేట్‌ పన్నులను తగ్గించి రూ.1.45 లక్షల కోట్ల మేర తన ఖజనాలో కోత విధించుకుంది. అయితే పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ చర్య చేపట్టింది. మరి గిరాకీని పెంచడానికి వ్యక్తిగత ఆదాయ పన్నుల్లో కోత వేయాలని అధిక శాతం కోరుకుంటున్నారు. అదీకాక గత బడ్జెట్లోనూ ఎటువంటి ఊరటలు ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

మార్పు తెచ్చే బడ్జెట్‌ కావాలి

భారత వృద్ధి 11 ఏళ్లలోనే కనిష్ఠ స్థాయికి జారింది. నిరుద్యోగ రేటు 45 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. దీంతో వ్యాపార వర్గాల్లో నిరాశలు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం గిరాకీకి ఊతమివ్వడం సహా.. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ను ఒక ‘వెలుగు రేఖ’లా మార్చడానికి బడ్జెట్‌ను మించిన సాధనం లేదని విశ్లేషకులు అంటున్నారు.

ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ప్రభుత్వానికి తక్కువ అవకాశాలు ఉన్నాయన్న సంగతి అందరూ ఒప్పుకుంటారు. ఎందుకంటే అటు ప్రత్యక్ష పన్నులు, ఇటు పరోక్ష పన్నుల్లో వృద్ధి అంతగా లేకపోవడం కారణంగా ద్రవ్యలోటుపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆర్థిక మందగమనం నేపథ్యంలో ప్రభుత్వం కచ్చితంగా ధైర్యవంతమైన అడుగులు వేయాల్సిన అవసరం ఉందని మనీ మేనేజర్లు అభిప్రాయపడుతున్నారు.11 ఏళ్ల కనిష్ఠానికి జీడీపీ రేటు చేరిన నేపథ్యంలో ఒక మంచి బడ్జెట్‌ ద్వారా వృద్ధికి ఊతమివ్వడమే ప్రభుత్వం ముందున్న అవకాశం.

రబీ సీజనులో పంట దిగుబడి బాగానే ఉండడానికి తోడు, అధిక ఆహార ద్రవ్యోల్బణం వల్ల గ్రామీణ ఆదాయాలు పెరుగుతాయన్న అంచనాలు ఉన్నాయి. ఇవి కొంత మేర ఆందోళనలు తగ్గించవచ్చు. మరో వైపు వ్యక్తిగత ఆదాయ పన్ను, దీర్ఘకాల మూలధన లాభాల పన్నుల విషయంలో ప్రభుత్వం ఊరటనిస్తుందన్న అందరూ భావిస్తున్నారు. స్థిరాస్తి రంగం, సంస్థాగత మదుపర్లు కూడా బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఇక 2024 కల్లా 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి మౌలికంపై రూ.100 లక్షల కోట్లను వెచ్చించనున్నట్లు మోదీ ప్రకటించారు కూడా.

మరోవైపు కార్పొరేట్‌ వర్గాలు కొన్ని విషయాల్లో ఆందోళన చెందుతున్నారు. గత కొన్నేళ్లలో పన్నులు బాగా పెరిగాయని వారు అంటున్నారు. ఇక ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌, దేవాన్‌ హౌసింగ్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ ఉదంతాల వల్ల బ్యాంకులు కూడా రుణాలివ్వడానికి దూరంగా జరుగుతున్నాయి. ఇది కూడా కార్పొరేట్ల విస్తరణ ప్రణాళికలకు అడ్డుగా నిలుస్తోంది. ఇటువంటి సమయంలో కలల బడ్జెట్‌కు మించిన బడ్జెట్‌ను తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే స్వల్పకాల వినియోగ గిరాకీని పెంచేందుకు ప్రాధాన్యం ఇస్తూనే.. పెట్టుబడులు, ఎగుమతి ఆధారిత ఆర్థిక వ్యవస్థ దిశగా ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదనలు చేయవచ్చన్న భారీ అంచనాలున్నాయి. ఆగస్టు నుంచి ఇప్పటిదాకా స్టాక్‌ మార్కెట్లు 15% మేర పెరగడానికి కారణం ఈ అంచనాలేనని అంటున్నారు. 21వ శతాబ్దం భారత్‌దేనని అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ అన్న మాటలు వాస్తవరూపం దాల్చాలంటే విధానాలు, ఆర్థిక వ్యవస్థపై దృక్పథం మారాలి. సెంటిమెంటును మెరుగుపరచాలి. అందుకు బడ్జెట్‌ ఓ మంచి అవకాశం.

ఇదీ చూడండి:పద్దు​ 2020: ఖర్చు ఎక్కువే చేయాలి.. కానీ సరైన మార్గంలో

Intro:Body:

Ajeet

Conclusion:
Last Updated : Feb 18, 2020, 8:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.