ETV Bharat / business

ఈ ఏడు టిప్స్​తో మీ నెట్​ బ్యాంకింగ్ సేఫ్​!

ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. ఒకప్పుడు డబ్బులు జమ చేయడం, విత్​ డ్రా చేయడం వంటి అవసరాలకు కచ్చితంగా బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరమే లేదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అన్ని లావాదేవీలు, ఇతర పనులు ఇంటి నుంచే చేసుకోవచ్చు. అయితే ఇదే కారణంతో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. మరి సైబర్ మోసాల వలలో చిక్కుకోకుండా నెట్ బ్యాంకింగ్​ను ఎలా వాడాలో నిపుణుల సలహాలు, సూచనలు మీకోసం.

How to Prevent Cyber attacks
సైబర్​ దాడుల నుంచి కాపాడుకోవడం ఎలా
author img

By

Published : Aug 10, 2021, 9:29 AM IST

ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంకు సేవలు పొందటం సులభతరం అయిపోయింది. నగదు బదిలీతో పాటు బిల్లుల చెల్లింపు, పలు ఇతర సేవలు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇంటి నుంచే సౌకర్యవంతంగా చేసుకోవచ్చు. బ్యాంకుకు వెళ్లి వరుసలో నిలబడే శ్రమను ఇది తగ్గించింది.

ఆన్​లైన్ బ్యాంకింగ్ సౌకర్యవంతంగా మారినప్పటికీ సైబర్ మోసాల నుంచి రిస్కు మాత్రం పొంచి ఉంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వీటిని నివారించుకోవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

పాస్​వర్డ్​ల మార్పు

ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఖాతాలో మొదటి సారి లాగిన్ అయినప్పుడు బ్యాంకు ఇచ్చిన పాస్​వర్డ్​ను ఉపయోగించినట్లయితే దానిని మార్చుకోవాలి. ప్రతి నెలా లేదా రెండు నెలలకు ఓ సారి పాస్​వర్డ్​ మార్చాలి. దీనివల్ల ఖాతా వివరాలు వేరే వారికి తెలిసినా కూడా లాగిన్ అవ్వటం వీలు కాదు. పాస్​వర్డ్​ను ఎప్పుడూ గోప్యంగా ఉంచుకోవాలి. ఇతరులతో షేర్​ చేయడం వల్ల మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

పబ్లిక్ కంప్యూటర్​లతో లావాదేవీలొద్దు..

ఇంటర్నెట్ సెంటర్​లు, లైబ్రరీల్లో సాధారణ కంప్యూటర్లను ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం వాడకపోవటమే ఉత్తమం. ఇలాంటి ప్రదేశాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ ఖాతా వివరాలు ఇతరులు చూసే లేదా తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి కంప్యూటర్లలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడాల్సి వస్తే.. బ్రౌజింగ్ హిస్టరీ, క్యాషేను డిలీట్ చేయాలి.

లాగిన్ ఐడీ, పాస్​వర్డ్ సేవ్​ చేయమని.. మీ బ్రౌజర్​ అనుమతి కోరితే అందుకు అనుమతించకూడదు. అలాగే పబ్లిక్ కంప్యూటర్లను ఉపయోగించినప్పుడు ప్రైవేట్ విండో ఉపయోగించుకోవటం ఉత్తమం.

వివరాలు ఎవరికీ చెప్పొద్దు

ఫోన్​లో కానీ, ఈ-మెయిల్ ద్వారా కానీ మీ బ్యాంక్..​ ఖాతా, పిన్​ వంటి వివరాలు అడగదు. కాబట్టి.. బ్యాంక్​ పేరు చెప్పుకుని ఎవరైనా ఓటీపీ, పాస్​వర్డ్​ కోసం కాల్స్​, మెసేజెస్​ చేస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మొద్దు.

ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ పేజీని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. యూఆర్ఎల్​లో హెచ్​టీటీపీఎస్ ఉంటేనే అది సురక్షితమైన సైట్​ అని గుర్తుంచుకోవాలి.

తరచూ చెక్ చేసుకోండి

ఆన్‌లైన్‌లో ఏదైనా లావాదేవీ చేసిన తర్వాత ఖాతాను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలి. ఖాతా నుంచి సరైన మొత్తం మాత్రమే చెల్లింపు అయిందా? అన్నది సరి చూసుకోవాలి. ఒకవేళ ఏమైనా తేడా అనిపిస్తే వెంటనే బ్యాంకును సంప్రదించాలి.

యాంటీ వైరస్..

కంప్యూటర్​ను వైరస్​ల బారి నుంచి కాపాడుకునేందుకు లైసెన్స్ ఉన్న యాంటీ వైరస్ సాఫ్ట్​వేర్ వాడుకోవాలి. పైరేటెడ్ యాంటీ వైరస్​లు ఉచితంగా లభించవచ్చు. కానీ వీటిని వాడటం వల్ల కంప్యూటర్​కు సరైన రక్షణ అందకపోవచ్చు. యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్లకు తరచుగా అప్​డేట్​లు వస్తుంటాయి. యాంటీ వైరస్ అప్డేటెడ్​గా ఉండే విధంగా చూసుకోవాలి. దీనివల్ల ఆన్​లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు సురక్షితంగా చేసుకోవచ్చు.

ఉపయోగించనప్పుడు నెట్ కనెక్షన్ తొలగించండి

బ్రాడ్​బ్యాండ్ ఉపయోగించే చాలా మంది ఇంటర్నెట్​ను వాడనప్పుడు డిస్ కనెక్ట్ చేయరు. దీనివల్ల హ్యాకర్లు, ఇతర సైబర్ రకాల మోసగాళ్లు ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా దాడి చేసి.. బ్యాంకింగ్ తదితర వ్యక్తిగత వివరాలను దొంగలించవచ్చు. దీన్ని నివారించేందుకు ఇంటర్నెట్​ను డిస్​కనెక్ట్ చేసుకోవటం ఉత్తమం.

ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూఆర్ఎల్

ఈ-మెయిల్ ద్వారా వచ్చిన లింక్​లను ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం వాడటం కంటే యూఆర్ఎల్​ను టైప్ చేసి వాడుకోవటం ఉత్తమం. సైబర్ మోసగాళ్లు ఈ-మెయిల్, మెస్సేజ్​ల ద్వారా లింక్​లు పంపించి మోసం చేయవచ్చు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.