ETV Bharat / business

జులైలో పారిశ్రామిక కార్మికుల ద్రవ్యోల్బణం 5.33% - పారిశ్రామిక కార్మికుల రిటైల్ ద్రవ్యోల్బణం

పారిశ్రామిక కార్మికుల రిటైల్ ద్రవ్యోల్బణం జులైలో 5.33 శాతంగా నమోదైంది. గతేడాది జులైలో 5.98 శాతంగా ఉంది. కొన్ని ఆహార పదార్థాలు చౌక అవ్వటం వల్ల రిటైల్​ ద్రవ్యోల్బణం తగ్గిందని కార్మిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

INFLATION
ద్రవ్యోల్బణం
author img

By

Published : Aug 31, 2020, 4:02 PM IST

పారిశ్రామిక కార్మికుల రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గింది. జులైలో 5.33 శాతానికి దిగివచ్చింది. గతేడాది జులైలో 5.98 శాతంగా నమోదైంది. అయితే, పారిశ్రామిక కార్మికులకు సంబంధించి జూన్​లో ద్రవ్యోల్బణం 5.06 శాతంగా ఉంది.

కొన్ని ఆహార పదార్థాలు చౌక అవ్వడం రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గడానికి కారణమైందని కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జులైలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 6.38 శాతంగా ఉండగా.. గత నెలలో 5.49 శాతం నమోదైంది. 2019 జులైలో ఇది 4.78 శాతంగా ఉంది.

పారిశ్రామిక కార్మికుల వినియోగ ధరల ఆధారిత సూచీ (సీపీఐ-ఐడబ్ల్యూ) గణాంకాలను కార్మిక శాఖ పరిధిలోని లేబర్‌ బ్యూరో విడుదల చేస్తుంది.

ఇదీ చూడండి: 'పెట్టుబడులకు ఆకర్షణీయంగా భారత వ్యాపార వాతావరణం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.