ETV Bharat / business

'ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావానికి వాటితో చెక్​' - సెప్టెంబర్​లో ఆర్థిక వృద్ధి సూచీల సానుకూల కదలిక

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలతో.. కరోనా నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ దిశగా కదులుతున్నట్లు ఆర్థిక శాఖ తాజా నివేదిక తెలిపింది. వ్యవసాయ, కార్మిక చట్టాల్లో సంస్కరణల వల్ల ప్రథమ, ద్వితీయ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరిగాయని వెల్లడించింది. సెప్టెంబర్​లో దేశ ఎగుమతులు పెరగటం.. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నాయన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నట్లు వివరించింది.

Center reforms to reduce corona impact on economy
సెప్టెంబర్​లో ఆర్థిక వృద్ధి సూచీల సానుకూల కదలిక
author img

By

Published : Oct 4, 2020, 8:24 PM IST

కరోనాతో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలు.. దేశ ఆర్థిక మూలాలను, దీర్ఘకాలిక సుస్థిర వృద్ధిని ప్రోత్సహిస్తాయని ఆర్థిక శాఖ తాజా నివేదిక వెల్లడించింది. అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వాటాదారులకు ఉన్న విధాన పరమైన వాతావరణం దేశ ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేందుకు దోహదం పడుతుందని.. ఆర్థిక వ్యవహారాల విభాగం రూపొందించిన నెలవారీ నివేదికలో పేర్కొంది.

కరోనా వైరస్ వ్యాపిస్తుండటం వల్ల.. స్వల్పకాలిక, మధ్యకాలిక వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం పడుతోందని.. దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వివిధ రంగాలతో కలిసి వ్యూహాత్మక, నిర్మాణాత్మక సంస్కరణలు చేపడుతున్నట్లు ఈ నివేదిక వివరించింది.

కరోనా తీవ్రత ఇలా..

సెప్టెంబర్ 17 నుంచి 30 మధ్య కరోనా కేసులను చూస్తే.. దేశంలో కొవిడ్​ విజృంభణ తీవ్రస్థాయి ముగిసినట్టు తెలుస్తోందని నివేదిక పేర్కొంది. ఈ సమయంలో ఏడు రోజుల పాటు రోజువరీ కేసులు నెమ్మదిగా 93 వేల నుంచి 83 వేలకు తగ్గుతూ వచ్చినట్లు నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో ఏడు రోజులపాటు రోజువారీ టెస్టులు .. సగటున 1,15,000 నుంచి 1,24,000గా ఉన్నట్లు తెలిపింది.

ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. దేశవ్యాప్తంగా పాజిటివ్​ల రేటు తగ్గటం.. ఆర్థిక పునరుద్ధరణకు మరింత ఊతమిస్తుందని అంచనా వేసింది నివేదిక.

ఇప్పటికే ఆలస్యం..

ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ మార్కెట్, కార్మిక చట్టాలు, ఎంఎస్​ఎఈల నిర్వచనం వంటి నిర్మాణాత్మక సంస్కరణలు.. ఇప్పుడిప్పుడే వృద్ధి చెందుతున్న ఎంఎస్​ఎంఈలకు మంచి అవకాశాలు సృష్టిస్తాయని నివేదిక ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రాథమిక, ద్వితీయ రంగాల్లో ఉద్యోగ కల్పనకు ఇది దోహదం చేస్తుందని పేర్కొంది.

దేశంలో వ్యవసాయ సంస్కరణలు చాలా ఆలస్యమయ్యాయని.. ప్రస్తుతం ఉన్న చట్టాలు రైతులను స్థానిక మండీలు, మధ్యవర్తులకు బానిసలుగా చేశాయని ఆరోపించింది.

'ఆత్మ నిర్భర్ భారత్' ప్యాకేజీ సహా అన్​లాక్​ల వల్ల ఆర్థిక వ్యవస్థ రికవరీకి ఊపందుకున్నట్లు వివరించింది నివేదిక. గత నెల ప్రధాన వృద్ధి సూచీలు అంతర్జరాతీయ పరిణామాలకు సమాంతరంగా సానుకూలంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది.

ఎగుమతులు పెరిగాయ్..

సెప్టెంబర్​లో దేశ ఎగుమతులు 5.3 శాతం పెరిగినట్లు నివేదిక పేర్కొంది. సెప్టెంబర్ 25 నాటికి దేశంలో విదేశీ మారకం నిల్వలు 542.02 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలిపిన ఆర్థిక శాఖ నివేదిక.. ఈ మొత్తం 13 నెలల దిగుమతులకు సరిపోతుందని వివరించింది. ఈ స్థాయిలో విదేశీ మారకం నిల్వలు ఉండటం ఎగుమతులు పెరగటం సహా.. దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయనే విషయాన్ని సూచిస్తున్నట్లు అభిప్రాయపడింది.

ఇదీ చూడండి:కరోనాతో భారతీయ మసాలాలకు మంచి డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.