ETV Bharat / business

ఆర్​బీఐ నుంచి కేంద్రానికి రూ.99,122 కోట్లు!

కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్​బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రానికి రూ.99,122 కోట్ల నిధులను బదిలీ చేయాలని నిర్ణయించింది. 2021 మార్చి 31తో ముగిసిన 9 నెలల అకౌంటింగ్ కాలానికి గానూ.. మిగులు నిధులుగా ఈ మొత్తాన్ని బదిలీ చేయనున్నట్లు తెలిపింది.

rbi surplus funds transfer to centre
ప్రభుత్వానికి ఆర్​బీఐ నిధులు
author img

By

Published : May 21, 2021, 1:56 PM IST

Updated : May 21, 2021, 5:13 PM IST

కేంద్రానికి రూ.99,122 కోట్ల మిగులు నిధులను బదిలీ చేయాలని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్​బీఐ) నిర్ణయం తీసుకుంది. ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సెంట్రల్ బోర్డ్​ డైరెక్టర్ల సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించింది.

రిస్క్​ బఫర్​ను 5.50 శాతం వద్ద కొనసాగిస్తూ ఈ నిధులను బదిలీ చేయాలని ఆర్​బీఐ నిర్ణయించింది. 2021 మార్చి 31తో ముగిసిన 9 నెలల అకౌంటింగ్ కాలానికి గానూ.. మిగులు నిధులుగా ఈ మొత్తాన్ని బదిలీ చేయనున్నట్లు తెలిపింది. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్​బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.

సంవత్సరాల వారీగా..

2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.57,128 కోట్లు కేంద్రానికి బదిలీ చేసింది ఆర్​బీఐ.

2018-19లో ఏకంగా 1,76,051 కోట్ల నిధులను కేంద్రానికి ఇచ్చింది. ఇందులో రూ.1,23,414 కోట్లు మిగులు నిధులు. మిగతా రూ.52,637 కోట్లను డివిడెండ్​గా ఇచ్చింది. మోదీ ప్రభుత్వ ఏర్పడిన తర్వాత ఆర్​బీఐ ఇచ్చిన అధిక మొత్తం ఇదే అత్యధికం.

2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను.. 50,000 కోట్లను కేంద్రానికి బదిలీ చేసింది ఆర్​బీఐ.

RBI surplus Funds to govt
గతంలో ఆర్​బీఐ మిగులు నిధుల బదిలీ వివరాలు..

మిగులు నిధులు కేంద్రానికే ఎందుకు?

ఆర్​బీఐను.. 1935, ఏప్రిల్ 1న బ్రిటీష్​ పాలనలో స్థాపించారు. భారతీయ రిజర్వు బ్యాంక్ యాక్ట్​ 1934ను అనుసరించి దీనిని ఏర్పాటు చేశారు. తొలుత ఇది పూర్తిగా ప్రైవేటు బ్యాంక్​గా సేవలందించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1949లో ఆర్​బీఐని భారత ప్రభుత్వం జాతీయం చేసింది. అప్పటి నుంచి ఆర్​బీఐపై పూర్తి హక్కులు ప్రభుత్వానికి బదిలీ అయ్యాయి. అయితే ఆర్​బీఐ చట్టం 1935 ప్రకారం ఆర్​బీఐ వద్దనున్న మిగులు నిధులను కేంద్రానికి బదిలీ చేయడం తప్పనిసరి అనే నిబంధన కొనసాగుతూ వస్తోంది.

ఇదీ చదవండి:భారత్‌కు సహకరించేందుకు సిద్ధం: ఐఎంఎఫ్​

Last Updated : May 21, 2021, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.