రెపోరేటుకు అనుగుణంగా గృహ, వాహన, ఎంఎస్ఎంఈ రుణాల వడ్డీ రేట్లను లింక్ చేయటం తప్పనిసరి అని బ్యాంకులకు స్పష్టంచేసింది ఆర్బీఐ. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత ఎంసీఎల్ఆర్ విధానం ప్రకారం బ్యాంకులిచ్చే రుణాలపై వడ్డీ రేట్ల సవరణ సంతృప్తికరంగా లేదని పేర్కొంది. ఈ కొత్త విధానాన్ని అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని సూచించింది. వడ్డీ రేట్ల తగ్గింపును వెంటనే రుణగ్రహీతలకు బదలాయించే లక్ష్యంతో ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఆర్బీఐ రెపో రేటుకు అనుగుణంగా బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించటం లేదని రిటైల్, పారిశ్రామికవర్గాల నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఇటీవల వివిధ రంగాలకు ఉద్దీపనలు ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.... కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ సవరించిన మేరకు బ్యాంకులు కూడా అమలు చేస్తాయని ప్రకటించారు.
ఇదీ చూడండి: స్టాక్ మార్కెట్లు డీలా- ఆర్థిక మాంద్యం తప్పదా!