ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మాస్టర్‌కార్డ్‌పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. జులై 22 నుంచి దేశీయంగా కొత్త కస్టమర్లకు డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు జారీ చేయడాన్ని నిషేధించింది.
యూజర్ల డేటా స్టోరేజీ సంబంధిత ఆదేశాలను పాటించనందుకు గానూ ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొంది ఆర్బీఐ. అయితే ఈ నిర్ణయంతో ఇప్పటికే మాస్టర్‌కార్డ్ వాడుతున్న వినియోదారులపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది.
ఏమిటీ డేటా స్టోరేజ్ వివాదం?
దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్లు.. దేశీయ యూజర్ల డేటా మొత్తం భారత్‌లోనే స్టోర్ చేయాలని ఆర్బీఐ 2018లో ఆదేశించింది. ఈ నిబంధనలను అమలు చేసేందుకు ఆయా సంస్థలకు కొంత గడువు కూడా ఇచ్చింది. అయినప్పటికీ డేటా స్టోరేజీ విషయంలో తగిన చర్యలు చేపట్టని సంస్థలపై ఆర్బీఐ చర్యలకు ఉపక్రమించింది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్, డైనర్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వంటి సంస్థలు కొత్త కస్టమర్లకు కార్డ్‌లు జారీ చేయకుండా ఇప్పటికే ఆంక్షలు విధించింది.
ఇదీ చదవండి:ఒప్పొ రెనో 6 వచ్చేసింది- ధర, ఫీచర్లు ఇవే..