ETV Bharat / business

చక్రవడ్డీ మాఫీ పథకాన్ని అమలు చేయండి: ఆర్​బీఐ

ఆరు నెలల మారటోరియం కాలానికి రూ.2 కోట్ల లోపు రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేయాలని బ్యాంకులు, ఇతర రుణ సంస్థలకు సూచించింది ఆర్​బీఐ. అన్ని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఈ పథకాన్ని కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.

RBI guidelines for interest waiver on interest
చక్రవడ్డీ మాఫీ పథకం అమలుకు ఆర్​బీఐ మార్గదర్శకాలు
author img

By

Published : Oct 27, 2020, 1:02 PM IST

కరోనా నేపథ్యంలో మార్చి​ నుంచి ఆగస్టు వరకు విధించిన మారటోరియం కాలానికి.. రుణగ్రహీతలకు వడ్డీపై వడ్డీ.. మాఫీని అమలు చేయాలని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలను(ఎన్​బీఎఫ్​సీలు) ఆర్​బీఐ కోరింది. రూ.2 కోట్ల వరకు రుణాలపై.. మారటోరియం కాలానికి సాధారణ వడ్డీ, వడ్డీపై వడ్డీ మధ్య తేడా నగదును రుణగ్రహీతల ఖాతాలో ప్రభుత్వం విధించిన గడువులోపు జమ చేయాలని సూచించింది.

కోర్టు అదేశాల మేరకు ఈ నెల 23న.. ఆరు నెలల కాలానికి రూ.2 కోట్ల లోపు రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. నవంబర్ 5లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని బ్యాంకులకు సూచించింది.

ఇదీ చూడండి:వడ్డీపై వడ్డీ మాఫీకి కేంద్రం మార్గదర్శకాలకు ఇలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.