ETV Bharat / business

కరోనా చీకట్ల నడుమ ఆర్​బీఐ ఉద్దీపన దీపం

ఆర్థిక వ్యవస్థకు దన్నుగా, బ్యాంకుల్లో సరిపడ ద్రవ్య లభ్యత ఉండేలా, చిన్నమధ్య తరహా పరిశ్రమలకు ఊతమిచ్చేలా ఆర్​బీఐ పలు కీలక ప్రకటనలు చేసింది. రివర్స్​ రెపోరేటును 25 బేసిస్​ పాయింట్లు తగ్గించడం సహా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

RBI
ఆర్​బీఐ
author img

By

Published : Apr 17, 2020, 11:59 AM IST

ఆర్థిక వ్యవస్థపై కరోనా నీడలు కమ్ముకుంటున్న వేళ భారతీయ రిజర్వు బ్యాంకు పలు ఉద్దీపన చర్యలతో ముందుకొచ్చింది. రివర్స్​ రెపో రేటు తగ్గింపు సహా చిన్న తరహా పరిశ్రమలకు పెద్ద సాయాన్ని అందించాలని నిర్ణయించింది.

"కరోనా కారణంగా ప్రపంచం అత్యంత దయనీయ స్థితిని ఎదుర్కొంటుంది. ఇలాంటి తరుణంలో ఆర్​బీఐ అప్రమత్తంగా ఉంది. పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం. సమయానికి అనుగుణంగా మరిన్ని ఉద్దీపనలతో ముందుకొస్తాం"

- శక్తికాంత దాస్​, ఆర్​బీఐ గవర్నర్

బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యకలాపాలు సాధారణ స్థితికి తెచ్చేందుకు ఆర్‌బీఐ పలు కీలక ఉద్దీపన చర్యలు ప్రకటించింది. దేశవ్యాప్త లాక్​డౌన్​ విధించాక ఆర్​బీఐ గవర్నర్​ మీడియా సమావేశం నిర్వహించడం ఇది రెండోసారి.

కరోనా సంక్షోభంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు రూ.50 వేల కోట్లతో ఎల్​టీఆర్​ఓ 2.0 ప్రకటించింది ఆర్​బీఐ. ఫలితంగా ఆర్థిక వ్యవస్థలోకి రూ.50 వేల కోట్లు అందుబాటులోకి రానున్నాయి. జాతీయ హౌసింగ్‌ బోర్డు, నాబార్డు, సిడ్బీకి ఈ నిధులు అందనున్నాయి.

ఆర్​బీఐ కీలక ప్రకటనలు...

  • రెపో రేటు యథాతథం.
  • రివర్స్‌ రెపోరేటు 4 శాతం నుంచి 3.75 శాతానికి (25 బేసిస్‌ పాయింట్లు) తగ్గింపు.
  • మారటోరియం సమయంలో 90 రోజుల ఎన్‌పీఏ గడువు వర్తించదు.
  • రాష్ట్రాలకు 60 శాతం మేర డబ్ల్యూఎంఏ పెంపు.
  • సెప్టెంబరు 30 వరకు డబ్ల్యూఎంఏ పెంపు అమలు.
  • ఖరీఫ్‌లో 36 శాతం ధాన్యం ఉత్పత్తి పెరిగింది.
  • భారత్‌ జీడీపీ 1.9 శాతంగా ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. జీ-20 దేశాల్లో భారత్‌ జీడీపీనే అధికం.
  • జీడీపీలో 3.2శాతం ద్రవ్యం అందుబాటులోకి తెచ్చాం.
  • బ్యాంకుల కార్యకలాపాలు సాఫీగా సాగుతున్నాయి.
  • లాక్‌డౌన్‌ వల్ల ప్రపంచ జీడీపీకి 9 ట్రిలియన్‌ డాలర్ల నష్టం.
  • 2021-22 ఏడాదికి వృద్ధిరేటు 7.4 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం.
  • ప్రపంచవ్యాప్తంగా దేశాల వృద్ధిరేట్లు తిరోగమనంలో ఉన్నాయి.
  • లాక్‌డౌన్‌ తర్వాత రూ.1.20 లక్షల కోట్లు విడుదల చేశాం.
  • దేశ వ్యాప్తంగా 91 శాతం ఏటీఎంలు పనిచేస్తున్నాయి.
  • బ్యాంకులు, ఏటీఎంలలో ఎప్పటికప్పుడు నగదు నింపుతున్నాం. బ్యాంకుల్లో సరిపడా దవ్ర లభ్యత ఉంది.

ఇదీ చూడండి: కరోనా దెబ్బకు చైనా రివర్స్ గేర్- జీడీపీ 6.8% క్షీణత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.