ETV Bharat / business

భారత్​-చైనా వాణిజ్యలోటుపై మోదీ, జిన్​పింగ్​ చర్చ! - వాణిజ్య చర్చలు

భారత్-చైనా​ మధ్య వాణిజ్య లోటుపై డ్రాగన్ దేశాధ్యక్షుడు జిన్​పింగ్​తో ప్రధాని నరేంద్ర మోదీ చర్చించినట్లు విదేశీ వ్యవహారాల కార్యదర్శి విజయ్​ గోఖలే స్పష్టం చేశారు. ఆర్థిక, వాణిజ్య రంగాల్లోనూ జిన్​పింగ్​తో మోదీ చర్చించారని గోఖలే తెలిపారు.

భారత్​-చైనా వాణిజ్యలోటుపై మోదీ, జిన్​పింగ్​ చర్చ!
author img

By

Published : Oct 12, 2019, 5:24 AM IST

చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్ తొలిరోజు పర్యటనలో భాగంగా ఆయనతో ప్రధాని నరేంద్రమోదీ ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు జరిపారు. చైనాతో భారత్​కు ఉన్న వాణిజ్య లోటు అంశంపై జిన్​పింగ్​తో జరిగిన రెండో అనధికారిక సమావేశంలో మోదీ చర్చించినట్లు.. విదేశీ వ్యవహారాల కార్యదర్శి విజయ్​ గోఖలే మీడియాకు వెల్లడించారు. మామల్లపురంలో ఇరు దేశాధినేతలు.. తమ దేశాల దృక్పథాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలపై చర్చించారని తెలిపారు.

"మోదీ, జిన్​పింగ్​ల మధ్య ముఖ్యంగా వాణిజ్య, ఆర్థిక పరమైన చర్చలు సాగాయి. ఇరుదేశాలు ప్రోత్సహించే పెట్టుబడి రంగాలను గుర్తించడం.. వాణిజ్య పరిమాణం, విలువను పెంచుకునే అంశాలపైనా చర్చలు సాగాయి. ఇందులో వాణిజ్య లోటును తగ్గించే అంశాలూ ఉన్నాయి."
-విజయ్ గోఖలే, విదేశీ వ్యవహారాల కార్యదర్శి

భాజపా ప్రభుత్వం ఇటీవల రెండోసారి ఎన్నికైన విషయాన్ని జిన్​పింగ్​కు గుర్తుచేస్తూ ఇరుదేశాల మధ్య ఆర్థిక అభివృద్ధి అవసరాన్ని మోదీ వివరించారని గోఖలే అన్నారు. దీనికి స్పందనగా వచ్చే నాలుగున్నరేళ్లలో మోదీతో.. సన్నిహితంగా మెలుగుతూ పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు జిన్​పింగ్​ స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: పడిపోతున్న పారిశ్రామిక ఉత్పత్తి..! రివర్స్ లో అభివృద్ధి..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com. Must credit ESPN.
SHOTLIST: Minute Maid Park, Houston, Texas, USA. 11 October 2019.
1. 00:00 Various of team at workout
2. 00:49 Alex Bregman taking fielding practice
3. 00:53 Jose Altuve taking fielding practice
4. 01:05 Various of batting practice
SOURCE: ESPN
DURATION: 01:56
STORYLINE:
The Houston Astros will play the New York Yankees in the American League Championship Series after beating the Tampa Bay Rays 6-1 in game five of the AL Division Series on Thursday.
Gerrit Cole's fine pitching was a major factor in the Astros advancing.
Game one against the Yankees is on Saturday night in Houston.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.