వినియోగదారులపై చమురు ధరల వాత కొనసాగుతోంది. వరసగా పదోరోజు పెట్రోల్, డీజిల్ లీటరు ధరలను వరసగా పదో రోజూ పెంచాయి చమురు సంస్థలు. మంగళవారం లీటర్ పెట్రోల్ 47 పైసల చొప్పున పెంచింది. డీజిల్ ధర 93 పైసలు చొప్పున పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ. 76.73కు, డీజిల్ రూ. 75.19కి చేరుకున్నాయి.
గత పదిరోజుల్లో పెట్రోల్‌పై రూ. 5.47, డీజిల్‌పై రూ.5.8 చొప్పున పెంచాయి చమురు సంస్థలు.
పెరిగిన విమాన ఇంధనం ధర
విమాన ఇంధనం ధర లీటరుకు 16శాతం పెంచాయి చమురు సంస్థలు. విమాన ఇంధన ధరను పెంచడం ఈ నెలలో ఇది రెండోసారి.
ఇదీ చూడండి: నెలాఖరుకల్లా దేశీయ విపణిలోకి రెమ్‌డెసివిర్