ETV Bharat / business

కార్లకు కరోనా సెగ- ఏప్రిల్​లో విక్రయాలు డీలా! - బైక్​ల విక్రయాల డేటా

కరోనా రెండో దశ దెబ్బకు కార్ల విక్రయాలు గత నెల 10 శాతం తగ్గాయి. ద్విచక్ర వాహనాల విక్రయాలు ఏకంగా 33 శాతం పడిపోయాయి. ఏప్రిల్ నెలకు గానూ వాహన విక్రయాలపై సియామ్ వెల్లడించిన గణాంకాలు ఇలా ఉన్నాయి.

Car sales down in April
తగ్గిన కార్ల విక్రయాలు
author img

By

Published : May 12, 2021, 2:15 PM IST

ఏప్రిల్​లో కార్ల విక్రయాలు భారీగా తగ్గాయి. రాష్ట్రాల వారీగా విధించిన ఆంక్షలు సహా కరోనా రెండో దశ విజృంభణ కారణంగా గత నెల 2,61,633 కార్లు మాత్రమే అమ్ముడైనట్లు వాహన తయారీదారుల సంఘం (సియామ్​) వెల్లడించింది.

ఇదే ఏడాది మార్చితో పోలిస్తే ఈ విక్రయాలు 10.07 శాతం తక్కువని తెలిపింది సియామ్​. మార్చిలో మొత్తం 2,90,939 ప్యాసింజర్ వాహనాలు విక్రయమవటం గమనార్హం.

సియామ్ గణాంకాలు ఇలా..

ద్విచక్ర వాహన విక్రయాలు ఏకంగా 33 శాతం తగ్గాయి. ఏప్రిల్​లో 9,95,097 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి. మార్చిలో ఈ సంఖ్య 14,96,806గా ఉండటం గమనార్హం.

మోటార్ సైకిళ్లు, స్కూటర్ల విక్రయాలు కూడా వరుసగా 33 శాతం, 34 శాతం తగ్గాయి. ఏప్రిల్​లో 6,67,841 మోటార్​ సైకిళ్లు, 3,00,462 స్కూటర్లు అమ్ముడయ్యాయి.

త్రిచక్ర వాహనాల విక్రయాలు అత్యధికంగా 57 శాతం పడిపోయాయి. ఏప్రిల్​లో కేవలం 13,728 యూనిట్లు విక్రయమయ్యాయి.

ఇదీ చదవండి:కొవిడ్​ 2.0తో ఈ కామర్స్​ డెలివరీలకు అంతరాయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.