ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి మందగించినా.. 2020-21లో భారీగా పుంజుకుంటుందని బడ్జెట్లో అంచనా వేశారు నిర్మలా సీతారామన్. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.30.42 లక్షల కోట్ల వ్యయాల అంచనా లెక్కగట్టారు.
రానున్న ఆర్థిక సంవత్సరం (2020-21)లో జీడీపీ వృద్ధి రేటు 10 శాతానికి పెరుగుతుందని బడ్జెట్లో అంచనా వేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
ఆదాయవ్యయాలు ఇలా..
ఆర్థిక సంవత్సరం | వ్యయం | ఆదాయం | నికర మార్కెట్ రుణాలు |
2020-21(అంచనా) | రూ.30.42 లక్షల కోట్లు | రూ.22.46 లక్షల కోట్లు | రూ.5.36 లక్షల కోట్లు |
2019-20 (సవరణ) | రూ.26.99 లక్షల కోట్లు | రూ.19.32 లక్షల కోట్లు | రూ.4.99 లక్షల కోట్లు |
ఇదీ చూడండి: కొత్త పన్ను రేట్లతో సామాన్యుడికి మిగిలేది ఎంత?