ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ కాలానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి ఐదు త్రైమాసికాల కనిష్ఠానికి తగ్గింది. 2018-19 3వ త్రైమాసికంలో 6.6శాతం వృద్ధి రేటు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి, రెండో త్రైమాసికంలో వరుసగా వృద్ధి రేటు 8 శాతం, 7 శాతంగా నమోదైనట్లు కేంద్ర గణాంకాల కార్యాలయం(సీఎస్ఓ) వెల్లడించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాను 7 శాతంగా సీఎస్ఓ పేర్కొంది. వృద్ధి రేటు 2017-18 తరహాలో 7.2 శాతంగా నమోదవుతుందని మొదట అంచనా వేసింది. అయితే తాజా సవరణలో ఈ అంచనాను 0.2 శాతం మేర తగ్గించింది.