ETV Bharat / business

'2020లో భారత వృద్ధిరేటు 0.2 శాతమే'

కరోనా లాక్​డౌన్ కారణంగా భారత వృద్ధిరేటు తగ్గనుందని అంచనా వేసింది ఆర్థిక గణాంక సంస్థ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్. ప్రస్తుత అంచనాల ప్రకారం 2020లో దేశ వృద్ధి 0.2 శాతంగా ఉంటుందని పేర్కొంది. జీ-20 దేశాల వృద్ధిలో 5.8 శాతం తగ్గుదల నమోదవుతుందని అంచనా వేసింది.

moodys
'2020లో భారత వృద్ధిరేటు 0.2 శాతమే'
author img

By

Published : Apr 28, 2020, 11:33 PM IST

కరోనా లాక్​డౌన్ కారణంగా దేశంలో ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. ఈ నేపథ్యంలో భారత వృద్ధి అంచనాలను సవరించింది ఆర్థిక గణాంక సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్. ప్రస్తుత అంచనాల మేరకు 2020లోభారత వృద్ధిరేటు 0.2 శాతం ఉండనుందని అంచనా వేసింది. అయితే 2021లో భారత వృద్ధి 6.2గా ఉంటుందని పేర్కొంది.

"భారత్​లో లాక్​డౌన్​ను 21 రోజుల నుంచి 40 రోజులకు పెంచారు. వ్యవసాయ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఆంక్షలను సడలించారు. కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే పలు ప్రాంతాల్లో సడలింపులకు భారత్ ప్రణాళికలు వేస్తోంది."

- మూడీస్ ప్రకటన

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమించే విధంగా వ్యయం పెరుగుతోందని అంచనా వేసింది మూడీస్​. గ్లోబల్ మ్యాక్రో ఔట్​లుక్ 2020-21 ఏప్రిల్ పేరుతో విడుదల చేసిన తాజా అంచనాల్లో జీ-20 దేశాల ఆర్థికవృద్ధి 5.8 శాతం మేర తగ్గనుందని పేర్కొంది.

గత నవంబర్​లో కరోనా వ్యాపించడానికి ముందు 2020లో ప్రపంచ వృద్ధి రేటు 2.6శాతంగా అంచనా వేసింది.

2020లో చైనా వృద్ధిరేటు 1 శాతం మేర పెరగనుందని, 2021లో 7.1 శాతంగా ఉంటుందని వెల్లడించింది. అమెరికా వృద్ధి 5.7 శాతం మేర, బ్రిటన్ 7, ఇటలీ 8.2, జపాన్ 6.5, ఫ్రాన్స్ 6.3శాతం మేర తగ్గనున్నట్లు స్పష్టం చేసింది. 2021లో అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు కరోనా వైరస్ ఉత్పన్నమయ్యేందుకు ముందున్న అంచనాల కంటే తగ్గుతాయని వెల్లడించింది.

2021లో ఆర్థిక వృద్ధితో పాటు ఇంధనానికి డిమాండ్ పెరగనున్న కారణంగా చమురు ధరలు పెరుగుతాయని పేర్కొంది. బ్రెంట్ ముడిచమురు ధర 45 అమెరికన్ డాలర్లుగా ఉంటుందని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: కరోనా దెబ్బకు భారీగా తగ్గిన గూగుల్, ఫేస్​బుక్ ఆదాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.