దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల 9న నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, సీఈఓ అమితాబ్ కాంత్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొనున్నారు.
"ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నీతి ఆయోగ్ ఉన్నతాధికారులతో గురువారం
సమావేశం కానున్నారు. "
-సీనియర్ ప్రభుత్వాధికారి.
2020-21 కేంద్ర బడ్జెట్ రూపకల్పన జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా మోదీతో దిగ్గజ పారిశ్రామికవేత్తలు సోమవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, వృద్ధిని పెంచడానికి, ఉద్యోగాల కల్పితాలకు అవసరమైన చర్యలపై పరస్పర చర్చలు జరిగాయి.
మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్తను బలపరిచే దిశగా... కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఇదీ చూడండి : 'ఎయిర్ ఇండియాను మూసేయడం లేదు'