ETV Bharat / business

'కరోనాతో సంక్షోభంలో పర్సనల్ లోన్స్​కే మొగ్గు' - వ్యక్తిగత రుణాలు

కరోనా ప్రభావంతో చాలా మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తాజా సర్వే వెల్లడించింది. తమ అవసరాలు తీర్చుకునేందుకు అత్యధికులు వ్యక్తిగత రుణాల వైపు మొగ్గు చూపిస్తున్నారని పేర్కొంది.

personal loans
వ్యక్తిగత రుణాలకే మొగ్గు
author img

By

Published : Jun 3, 2020, 6:16 AM IST

కరోనా లాక్​డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని 82 శాతం భారతీయులు విశ్వసిస్తున్నారు. వీరిలో అత్యధికులు డబ్బు అవసరాలను తీర్చుకునేందుకు 'పర్సనల్​ లోన్స్​'ను ఆశ్రయిస్తున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది.

దేశంలోని 5 వేల మంది అభిప్రాయాలను డిజిటల్ రుణాల వేదిక ఇండియాలెండ్స్ సేకరించింది.

"కరోనా విపత్తు ఆర్థిక పరిస్థితులను క్లిష్టతరం చేసిందని ఉద్యోగులు, నిపుణుల్లో 82 శాతం అంగీకరించారు. అవసరాలను తీర్చుకునేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి రుణాలు తీసుకోవాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యమైన ఖర్చులు.. రుణాల చెల్లింపు, వైద్య, విద్య రుసుములు ఇతర ఇంటి మరమ్మతుల అవసరాలను తీర్చుకునేందుకు 72 శాతం మంది వ్యక్తిగత రుణాలు తీసుకునేందుకు మొగ్గు చూపారు."

-ఇండియాలెండ్స్ నివేదిక

ఖర్చులు తగ్గిస్తాం..

ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 95 శాతం మంది ఖర్చుల విషయంలో జాగ్రత్త వహిస్తామని చెప్పారు. ఖర్చులు తగ్గించుకుంటున్నామని 84 శాతం మంది అంగీకరించారు. దాదాపు 90 శాతం మంది తమ సేవింగ్స్​, ఆర్థిక భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం అత్యవసర వస్తువులపై ఖర్చు పెంచేందుకు ప్రయత్నిస్తామని 40 శాతం చెప్పారు. లాక్​డౌన్ తర్వాత కూడా అత్యవసరం కాని వస్తువులు.. వినోదం, విలాసం, లైఫ్​స్టైల్​ వంటివాటిపై వ్యయం తగ్గిస్తామని తెలిపారు.

వ్యక్తిగత రుణాలే మేలు..

"ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న వేళ ఆస్తుల అమ్మకాలు, తాకట్టు సాధ్యపడవు. ఈ పరిస్థితుల్లో వ్యక్తిగత రుణాలు, లైన్​ ఆఫ్ క్రెడిట్​పైనే ఆధారపడటం మంచిది. అయితే మన అవసరాలను బట్టి ప్రణాళిక వేసుకోవాలి."

-ఇండియా లెండ్స్ సీఈఓ గౌరవ్ చోప్రా

పెట్టుబడులపై..

వ్యక్తిగత ఆర్థిక స్థితి మందగించటం వల్ల పెట్టుబడులపై ప్రభావం పడుతుందని ఇండియాలెండ్స్ సర్వే గుర్తించింది. సర్వేలో పాల్గొన్నవారిలో 76 శాతం మంది ఈ సమయంలో కొత్త పెట్టుబడులపై ఆసక్తి చూపించలేమని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.