ETV Bharat / business

కరోనా ఆంక్షలతో రూ.79 వేల కోట్ల నష్టం! - ఆర్థిక వ్యవస్థపై కఠిన ఆంక్షల ప్రభావం

కరోనా తీవ్రతను అదుపు చేసేందుకు రాష్ట్రాలు స్థానికంగా విధిస్తున్న ఆంక్షలు, లాక్​డౌన్ వంటి నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తున్నట్లు ఓ నివేదిక పేర్కొంది. ఈ ఆంక్షలు మే చివరి నాటికి కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ 10.5 బిలియన్​ డాలర్ల నష్టాన్ని చవి చూడొచ్చని తెలిపింది.

Weekly Rs 94k cr loss to India with Corona norms
భారత్​కు వారానికి 94 వేల కోట్ల నష్టం
author img

By

Published : Apr 14, 2021, 7:22 PM IST

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు స్థానికంగా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు వారానికి 1.25 బిలియ‌న్ డాల‌ర్ల(రూ.9 వేల కోట్లకు పైగా) నష్టం వాటిల్లోచ్చని బ్రిటీష్ బ్రోక‌రేజ్ సంస్థ బార్క్లేస్ అంచనా వేసింది. ప్ర‌స్తుత అంక్ష‌లు మే చివ‌రి వ‌ర‌కు కొనసాగిస్తే.. ఆర్థిక‌, వాణిజ్య కార్య‌క‌లాపాల నష్టం 10.5 బిలియ‌న్ డాల‌ర్లు(రూ. 79 వేల కోట్లు) తాకొచ్చని పేర్కొంది.

నివేదికలో తేలిన మరిన్ని విషయాలు..

అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల్లో కొవిడ్​ రెండు, మూడో ద‌శ‌ల‌లో నెలకొన్న ప‌రిస్థితి కంటే.. భార‌త్‌లో ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.

కొత్త కేసుల్లో 81 శాతానికి పైగా కేవ‌లం 8 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఆ రాష్ట్రాలన్ని దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైనవే. ఇది వృద్ధికి ప్రతికూల అంశం.

మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, త‌మిళ‌నాడు, రాజ‌స్థాన్ వంటి పెద్ద రాష్ట్రాల్లో కరోనా తీవ్రత వ‌ల్ల 60% ఆర్థిక వ్య‌వ‌స్థ ప్రభావితమవుతోంది.

దేశ జీడీపీలో 16 శాతం వాటా ఉన్న మ‌హారాష్ట్ర‌లో కేసుల పెరుగుదల వల్ల 2021-22లో జాతీయ ఆర్థిక స్థాయిలో స్థూల విలువ ఆధారిత వృద్ధిని 0.32% త‌గ్గిస్తాయ‌ని కేర్ రేటింగ్స్ నివేదిక అంచనా.

కొత్త‌గా లాక్‌డౌన్​ వల్ల ఈ నెల‌లో సుమారు రూ. 40 వేల కోట్ల గ్రాస్​ వాల్యూ యాడెడ్ (జీవీఏ) న‌ష్టం కలగొచ్చు. ఆంక్ష‌లు పొడిగించ‌డంవ‌ల్ల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది.

భార‌త్‌లో 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో 11% వృద్ధి రేటు అంచనాలు ఉన్నాయి. కానీ మ‌రిన్ని రాష్ట్రాల‌ క‌ఠిన అంక్ష‌ల వ‌ల్ల ఈ స్థాయి వృద్ధి క‌ష్ట‌మేన‌ని ఆర్థిక వేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు.

ఇదీ చదవండి: సౌరశక్తి మచ్చికకు మానవ యుక్తి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.