ETV Bharat / business

క్యూ4లో అదరగొట్టిన జపాన్- నిక్కీ 30 ఏళ్ల రికార్డ్

దేశవ్యాప్తంగా వినిమయం పెరిగిన నేపథ్యంలో జాపాన్​ వృద్ధి రేటు 2020 క్యూ4లో 12.7 శాతానికి పుంజుకుంది. కరోనా కారణంగా తొలి రెండు త్రైమాసికాల్లో జపాన్​ వృద్ది రేటు భారీగా క్షీణించింది. ఫలితంగా వార్షిక ప్రాతిపదికన 2020లో జీడీపీ 4.8 శాతం కుంగింది. జపాన్​ జీడీపీ క్షీణించడం 11 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం.

Japan GDP recovering
తేరుకుంటున్న జపాన్ జీడీపీ
author img

By

Published : Feb 15, 2021, 5:38 PM IST

Updated : Feb 16, 2021, 11:52 AM IST

డిసెంబరుతో ముగిసిన త్రైమాసికం నాటికి జపాన్‌ వార్షిక వృద్ధి రేటు 12.7 శాతానికి పుంజుకుంది. మూడో త్రైమాసికంలో 3 శాతం వృద్ధి నమోదు కావడం వల్ల.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వరుసగా రెండు త్రైమాసికాల్లో పైకి ఎగబాకింది. కరోనా నేపథ్యంలో అంతకుముందు త్రైమాసికాల్లో జపాన్‌ ఆర్థిక వ్యవస్థ భారీగా కుంగిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వ్యయం, ఎగుమతులు, దేశవ్యాప్తంగా వినిమయం పుంజుకోవడం వల్లే వృద్ధి నమోదైందని అధికారులు వెల్లడించారు. మొత్తంగా 2020లో జపాన్‌ వృద్ధి రేటు 4.8 శాతం కుంగింది. గత 11 ఏళ్లలో ఆ దేశ వృద్ధి రేటు క్షీణించడం ఇదే తొలిసారి.

కరోనా సంక్షోభంలోనూ జపాన్‌లో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ విధించలేదు. ఇంటి నుంచి పని, సామాజిక దూరం పాటించడం వంటి నియమాల్ని ప్రభుత్వం ప్రోత్సహించింది. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే కఠిన ఆంక్షలు అమలు చేసింది. ఇక ఈ ఏడాది ఆరంభంలో కొత్త రకం కరోనా భయాలతో టోక్యో సహా మరికొన్ని ప్రధాన నగరాల్లో ఎమర్జెన్సీ విధించారు. దీంతో ప్రస్తుత త్రైమాసికంలో మరోసారి వృద్ధి రేటు నెమ్మదించొచ్చని ఆ దేశ ఆర్థిక నిపుణుడు జునిచి మకినో అంచనా వేశారు. అయితే, ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలు గాడిలోకి వస్తున్న నేపథ్యంలో జపాన్‌ వృద్ధి రేటుకు దన్ను లభించొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. విస్తృతంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కూడా కలిసివస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

30 ఏళ్ల గరిష్ఠానికి 'నిక్కీ' ..

జపాన్‌ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న నేపథ్యంలో అక్కడి స్టాక్‌ మార్కెట్‌ సూచీ నిక్కీ 225 భారీగా పుంజుకుంది. దీంతో 30,000 పాయింట్ల మార్క్‌ను దాటి 30 ఏళ్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది. 1990 ఆగస్టు తర్వాత సూచీ ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. 2012లో జీవితకాల కనిష్ఠాలకు తాకిన ఈ సూచీ క్రమంగా పుంజుకుంటూ వస్తోంది. కొవిడ్‌ సంక్షోభంతో ఓ దశలో మరోసారి ఒత్తిడికి గురైనప్పటికీ.. క్రమంగా కోలుకొంది. సోమవారం 1.91 శాతం లాభపడ్డ నిక్కీ 30,084 వద్ద స్థిరపడింది. దేశీయంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండడం సహా, అంతర్జాతీయంగా మార్కెట్లు సానుకూలంగా కదలాడుతుండడం నిక్కీకి దన్నుగా నిలిచింది. ఎకనమిక్‌ బబుల్‌ బర్‌స్ట్‌ తర్వాత ఈ స్థాయిలో మార్కెట్లు పుంజుకోవడం ఇదే తొలిసారి. అయినప్పటికీ.. 1989లో రికార్డయిన 38,915.87 మార్క్‌ను చేరుకునేందుకు జపాన్‌ సూచీ మరో 30శాతం ఎగబాకాల్సి ఉంది.

ఇదీ చదవండి:2020-21లో ఐటీ ఆదాయం 2.3% వృద్ధి!

Last Updated : Feb 16, 2021, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.