ETV Bharat / business

కరోనా కాలంలో పసిడిపై పెట్టుబడులు కలిసొస్తాయా?

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా సంక్షోభం నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఉత్తమ సాధనాలు ఏవి? రికార్డు స్థాయిలో ధర పెరిగిన బంగారంపై పెట్టుబడి ఇప్పుడు ఎంత వరకు ఉత్తమం? భవిష్యత్​లో పసిడి ధర ఇంకా పెరిగే అవకాశాలున్నాయా?

Good time for Invest in Gold
బంగారంపై పెట్టుబడులకు సరైన సమయం
author img

By

Published : Jul 10, 2020, 1:29 PM IST

ఈ ఏడాది ప్రారంభంలో రికార్డు స్థాయిల వద్ద ఉన్న స్టాక్ మార్కెట్లు.. కరోనా సంక్షోభంతో కుదేలవుతూ వచ్చాయి. ఇంకా చెప్పాలంటే ఏప్రిల్​లో సంక్షోభంలోకి జారుకుని ట్రేడింగ్ నిలిపివేస్తే ఎలా ఉంటుంది? అనే అంశం కూడా తెరపైకి వచ్చింది. అయితే మార్కెట్లు ఇటీవల కాస్త తేరుకున్నా.. ఇంకా కరోనా అనిశ్చితి పోలేదనే చెప్పాలి.

స్టాక్ మార్కెట్లు నెగెటివ్ వృద్ధి..

కరోనో అనిశ్చితి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సెన్సెక్స్‌ 10 శాతానికి పైగా నెగెటివ్ రిటర్న్‌లను అందించింది. డెట్ పెట్టుబడి సాధానాలు కూడా తక్కువ రిటర్న్‌లను అందిస్తున్నాయి. కరోనా వల్ల ఆర్థిక పరిస్థితులు దెబ్బ తినటం సహా ఇంకా ఎంత కాలం వైరస్ ఉంటుందోనన్న అనిశ్చితులు కొనసాగుతుండటం వల్ల బంగారం ధరలు గత కొంత కాలంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచి బంగారం ధర 23 శాతం పెరిగింది. గత 18 నెలల్లో ఏకంగా 50 శాతం రిటర్న్‌లను ఇచ్చింది. ఇంకా బంగారం ధర వృద్ధి కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆర్థిక వృద్ధి భయాలు..

సాధారణంగా అంతర్జాతీయంగా అనిశ్చితులు ఉన్నప్పుడు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. దీనితో డిమాండ్ పెరిగి ధర కూడా పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి నెమ్మదించటం, వడ్డీ రేట్లు తక్కువగా లేదా మైనస్‌లలో ఉండటం వంటి కారణాలతో ఈ సంవత్సరం ధర పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రికవరీ రేటు, డాలరు పరిస్థితి, వివిధ దేశాల ప్యాకేజీలపై సమీప భవిష్యత్తులో బంగారం ధర ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. దీర్ఘ కాలంలో రిస్కును తగ్గించి, రిటర్న్‌లను పెంచేది పుత్తడేనని వారు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న ధరల్లో కూడా మంచి రిటర్న్‌లనే ఇస్తాయని పలువులు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

హెచ్చుతగ్గులున్నా పైపైకే..

ప్రపంచవ్యాప్తంగా గోల్ట్‌ ఈటీఎఫ్‌లు స్థిరంగా పెరుగుతున్నాయన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇవి ఇంకా అలానే కొనసాగే పరిస్థితే కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు. స్వల్ప కాలంలో బంగారం ధర కొంచెం హెచ్చుతగ్గులకు లోనైప్పటికీ దీర్ఘ కాలంలో మాత్రం పెరుగుతూనే ఉంటుందన్నది వారి మాట.

"జీవన కాల గరిష్ఠాలను దాటి దీర్ఘకాలంలో బంగారం ధర పైకి వెళ్తుందని భావిస్తున్నాం. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు బలహీనంగా ఉన్నాయి. దీనితో పాటు పలు దేశాలు కరెన్సీ విరివిగా ప్రింట్ చేయటం వల్ల వాటి విలువ తగ్గుతోంది. దీనివల్ల బంగారం ధర పెరుగుతోంది. స్టాక్ మార్కెట్లు రికవరీ దిశగా కదులుతున్నందున.. మళ్లీ కరెక్ట్ అవుతుందన్న భావనతో మదుపరులు గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడులకు మళ్లుతున్నట్లు కనబడుతోంది. అమెరికాలో ఎన్నికలతో పాటు పలు అనిశ్చితులు ఉన్న దృష్ట్యా బంగారాన్ని సురక్షితంగా భావిస్తున్నారు."

- సతీశ్ కంతేటి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, జెన్‌ మనీ

ఇలా చేస్తే మంచి లాభాలు...

మదుపరులు తమ పోర్ట్​ఫోలియోలో బంగారంపై 10 నుంచి 15 శాతం పెట్టుబడి పెట్టుకోవాలని పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు చెబుతున్నారు. భౌతికంగా బంగారంలో పెట్టుబడులు పెట్టటం ద్వారా లాభాలు తగ్గే అవకాశం ఉందని సూచిస్తున్నారు. జీఎస్​టీ, ఆభరణాల తయారీ వంటి అదనపు ఖర్చులుంటాయని చెబుతున్నారు.

గోల్డ్​ కాయిన్స్‌, బిస్కెట్లు కొనుగోళ్లలో కూడా జీఎస్‌టీ లాంటి ఛార్జీలు ఉంటాయి. సార్వభౌమ గోల్డ్ బాండ్లు (ఎస్‌జీబీ), గోల్డ్‌ ఈటీఎఫ్‌ల ద్వారా బంగారంలో పెట్టుబడులు పెట్టటం ఉత్తమమని సూచిస్తున్నారు నిపుణులు. వీటిపై వడ్డీ 2.5 శాతం ఉంటుంది. వడ్డీని సంవత్సరానికి రెండు సార్లు చెల్లిస్తారు. ఎస్‌జీబీలలో కొనుగోలు చేసేందుకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. వీటిపై మూలధన లాభాల పన్ను కూడా ఉండదు.

గోల్డ్​ ఈటీఎఫ్‌లు బంగారంపై భౌతికంగా పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్ల లాంటివి. ఇందులో భౌతికంగా బంగారంపై పెట్టుబడి పెడతారు. ఇవి స్టాక్ ఎక్సైంజీలలో ట్రేడ్ అవుతాయి. ఎలాంటి ఛార్జీలు లేకుండా కొనుగోలు చేసే వీలుంటుంది. ఇవి క్రయవిక్రయం ఎస్‌జీబీల కంటే చాలా సులభం.

ఇదీ చూడండి:'వస్తువేదైనా ఏ దేశంలో తయారైందో చూపాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.