పెట్టుబడి, పొదుపు విషయంలో ఫిక్స్డ్ డిపాజిట్(ఎఫ్డీ)లకు మంచి ఆదరణ ఉంది. బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి ఒక్కరు దీని గురించి వినే ఉంటారు. సాధారణ సేవింగ్స్ ఖాతా కంటే దీనిపై వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సురక్షితమైన పెట్టుబడిగానూ దీనిని పరిగణిస్తుంటారు.
ఎఫ్డీలో అధిక వడ్డీ రేటు పొందేందుకు పలు రకాల ఆప్షన్లను ఎంచుకోవచ్చు. పన్ను ప్రయోజనాలనూ పొందవచ్చు. ఎఫ్డీలకు సంబంధించి వడ్డీ రేట్లు బ్యాంకులను బట్టి మారుతుంటాయి. అదే విధంగా డిపాజిట్ కొనసాగించే వ్యవధి, డిపాజిట్ మొత్తాన్ని బట్టి కూడా రాబడి ఉంటుంది.
వృద్ధులకు(సీనియర్ సిటిజన్స్) అయితే వడ్డీ రేట్లు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 2.90 శాతం నుంచి 6.30 వరకు ఉన్నాయి. కొన్ని బ్యాంకులు అంతకంటే ఎక్కువ కూడా ఇస్తున్నాయి. ముఖ్యంగా స్మాల్ ఫినాన్స్ బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేటు ఇస్తున్నాయి.
ఫిక్స్డ్ డిపాజిట్ ప్రారంభించే ముందు పలు బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లను తెలుసుకోవటం ముఖ్యం. తద్వారా ఏ బ్యాంకులో ఎక్కువ వడ్డీ రేటు లభిస్తుంది? ఎందులో ఎక్కువ ప్రయోజనాలు పొందొచ్చు? అనే విషయాలు తెలుస్తాయి.
బ్యాంకులు సాధారణంగా రూ.2 కోట్ల డిపాజిట్ వరకు ఒక రకమైన వడ్డీ రేటును.. అపై డిపాజిట్లకు మరో వడ్డీ రేటును ఇస్తుంటాయి.
రూ.2 కోట్ల డిపాజిట్ వరకు వివిధ బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లను తెలుసుకుందాం.
ఎస్బీఐ
ఐసీఐసీఐ బ్యాంక్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్
యాక్సిస్ బ్యాంక్
కోటక్ మహీంద్రా బ్యాంక్
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఇవీ చదవండి: