ETV Bharat / business

కరోనాతో భారత్​లో బెర్లిన్ యుద్ధం నాటి స్థితి!

author img

By

Published : Jun 23, 2020, 2:22 PM IST

కరోనాతో నెలకొన్న సంక్షోభం తర్వాత దేశంలో ఆర్థిక అసమానతల అంతరం తగ్గొచ్చని ఎస్​బీఐ నివేదిక అంచనా వేసింది. లాక్​డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయిందని పేర్కొంది. వీటితో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ, వ్యక్తిగత ఆదాయాలపై పలు కీలక విషయాలను వెల్లడించింది ఈ సర్వే.

per capita income post Covid
పర్​ క్యాపిటాపై ఎస్​బీఐ అంచనాలు

కరోనా సంక్షోభం తర్వాత దేశంలో ఆర్థిక అసమానతల అంతరం భారీగా తగ్గొచ్చని ఎస్​బీఐ అధ్యయనంలో వెల్లడైంది. ధనిక రాష్ట్రాల అదాయం.. పేద రాష్ట్రాలతో పోలిస్తే అధికంగా తగ్గొచ్చని తేలింది.

నివేదికలోని కీలకాంశాలు:

  • జాతీయ తలసరి ఆదాయం (పీసీఐ) 2020-21లో 5.4 శాతం తగ్గి.. రూ.1.43 లక్షలకు చేరొచ్చు.
  • 1989 బెర్లిన్​ యుద్ధం​తో జర్మనీలో నెలకొన్న పరిస్థితుల్నే భారత్ ఎదుర్కోవచ్చు.
  • నామినల్ జీడీపీ 3.8 శాతం తగ్గుదల కన్నా.. పీసీఐ క్షీణత అధికంగా ఉండొచ్చు.
  • ప్రపంచవ్యాప్తంగా 2020లో తలసరి జీడీపీ 6.2 శాతం క్షీణిస్తుంది. ఇది ప్రపంచ వాస్తవిక జీడీపీ తగ్గుదల (5.2 శాతం) కన్నా తక్కువ.
  • ధనిక రాష్ట్రాలు (దేశీయ సగటు కన్నా ఎక్కువ తలసరి ఆదాయం ఉండే రాష్ట్రాలు) పీసీఐ పరంగా ఎక్కువ ప్రభావితమవుతాయి.
  • దిల్లీ (-15.4 శాతం), చంఢీగఢ్​ (-13.9 శాతం) మేర అధిక క్షీణతను నమోదు చేయొచ్చు.
  • మొత్తం 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు రెండు అంకెల పీసీఐ క్షీణతను చవిచూడొచ్చు.
  • పట్టణ ప్రాంతాలపై లాక్​డౌన్ ప్రభావం తీవ్రంగా పడింది. మార్కెట్లు, షాపింగ్ కాంప్లెక్స్​లు, మాల్స్ వంటివి మూత పడటం వల్ల ఈ ప్రాంతాల్లో ఆదాయం భారీగా పడిపోయింది.
  • లాక్​డౌన్​ సడలింపులతో మార్కెట్లు, మాల్స్ తెరుచుకున్నా.. సాధారణ సమయాలతో పోలిస్తే వినియోగదారుల తాకిడి 70-80 శాతం తగ్గింది.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మహారాష్ట్ర, గుజరాత్​, తెలంగాణ, తమిళనాడులో పీసీఐ 10-12 శాతం తగ్గే అవకాశం ఉంది.
  • మధ్యప్రదేశ్​, ఉత్తర్​ప్రదేశ్, బిహార్​, ఒడిశా వంటి రాష్ట్రాల్లో పీసీఐ 8 శాతం కన్నా తక్కువగా నమోదు కావచ్చు.
  • 2020-21లో దేశ జీడీపీ 6.8 శాతం క్షీణతను నమోదు చేయొచ్చు.
  • దేశ ఆర్థిక వ్యవస్థ.. కరోనాకు ముందున్న స్థాయికి చేరుకునేందుకు కనీసం 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు సమయం పట్టొచ్చు.

ఇదీ చూడండి:దేశ ఆర్థిక వ్యవస్థపై లాక్​డౌన్​ ప్రభావం ఎంతంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.