బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం పార్లమెంట్ ముందు ఆర్థిక సర్వే 2020-21ని ఉంచింది కేంద్రం. ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు రూపొందించిన సర్వేలోని హైలైట్స్ మీకోసం.
- 2020-21లో దేశ ఆర్థిక వ్యవస్థ 7.7 శాతం క్షీణతను నమోదు చేయొచ్చు
- కరోనా టీకా ప్రక్రియ వల్ల ఆర్థిక వ్యవస్థ V-ఆకారపు రికవరీని సాధిస్తుంది
- కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా.. తగినన్ని విదేశీ మారక నిల్వలు, తయారీ రంగం నుంచి సానుకూల సంకేతాలు, దృఢమైన కరెంట్ ఖాతా వంటివి V-ఆకారపు రికవరీకి దోహదం చేశాయి
- 2021-22లో వృద్ధి రేటు ఏకంగా 11 శాతంగా నమోదయ్యే అవకాశముంది
- ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితి వందేళ్లలో ఒకసారి వస్తుంది
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంర్ధంలో.. ఎగుమతులు 5.8 శాతం తగ్గొచ్చు. దిగుమతులు 11.3 శాతం తగ్గొచ్చు.
- దేశ సార్వభౌమ క్రెడిట్ రేటింగ్ విషయంలో విదేశీ రేటింగ్ ఏజెన్సీలు పారదర్శకంగా వ్యవహరించాలి. ఆర్థిక వ్యవస్థలకు అనుగుణంగా మదింపు చేసే విధానం ఉండాలి
- యూపీ, గుజరాత్, బిహార్ రాష్ట్రాలు కరోనా కేసులు పెరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాయి. కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువ మంది ప్రాణాలను కాపాడాయి
- 2020 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు క్రితం ఏడాదితో పోలిస్తే 34 శాతం పెరిగాయి
- సంక్షోభ సమయంలోనూ గత ఏడాది అత్యధికంగా 12 అంకుర సంస్థలు యూనికార్న్ జాబితాలో చేరాయి
ఆరోగ్య భారతం..
- వేగంగా స్పందించి లాక్డౌన్ విధించడం వల్ల దేశంలో 37 లక్షల కేసులు తగ్గించగలిగాం. లక్ష ప్రాణాలను కాపాడగలిగాం
- ఆరోగ్య రంగ వ్యయాలు జీడీపీలో 1 శాతం నుంచి 2.5-3 శాతం వరకు పెంచాలని కేంద్రానికి సూచన
- కరోనా లాంటి మహమ్మారులను ఎదుర్కొనేందుకు భారత ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలు మెరుగవ్వాలి
- ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం ద్వారా టెలీమెడిసిన్ సేవలను సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది
సంస్కరణలు..
నియంత్రణ నిబంధనలు సరళీకృతం చేయాలి. నిర్ణయ, పర్యవేక్షన విధానాల్లో మరింత పారదర్శకత అవసరం.
సర్వే ఈ బుక్ కోసం క్లిక్ చేయండి
ఇవీ చూడండి: