ETV Bharat / business

భారత వృద్ధిరేటు -11.5 శాతం: మూడీస్​

2021 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాలను ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్​ భారీగా కుదించింది. తొలుత -4 శాతంగా ఉంటుందని అంచనా వేసిన మూడీస్​.. ప్రస్తుతం -11.5 శాతానికి తగ్గించింది.

BIZ-MOODYS-GROWTH
భారత వృద్ధిరేటు
author img

By

Published : Sep 11, 2020, 6:06 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటును -11.5 శాతానికి తగ్గించింది ప్రముఖ రేటింగ్ సంస్థ మూడీస్. తొలుత -4 శాతం ఉంటుందని చెప్పిన మూడీస్​.. తొలి త్రైమాసికం ఫలితాల తర్వాత తాజా అంచనాలను విడుదల చేసింది.

దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని మూడీస్​ అభిప్రాయపడింది. అధిక రుణ భారం, బలహీన ఆర్థిక వ్యవస్థ కారణంగా క్రెడిట్​ ప్రొఫైల్​పై ప్రభావం పడిందని వివరించింది. 2021-22 ఆర్థిస సంవత్సరంలో 10.6 శాతం వృద్ధి రేటు సాధించే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ఇతర రేటింగ్ ఏజెన్సీలు కూడా ఇదే తరహా అంచనాలను విడుదల చేశాయి.

  • ఫిచ్​ రేటింగ్స్​: -10.5 శాతం
  • క్రిసిల్​: -9 శాతం
  • ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్​: -11.8శాతం

ఇదీ చూడండి: 2021లో భారత వృద్ధి రేటు -10.5%: ఫిచ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.