ETV Bharat / business

2021-22లో భారత వృద్ధి రేటు 9.5 శాతం!

కరోనా కారణంగా భారత్​కు ఈ ఆర్థిక సంవత్సరం ఆర్థిక సంక్షోభం ఎదురైనా.. 2021-22 ఆశాజనకంగా ఉన్నట్లు రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తాజా నివేదికలో వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్​ 9.5 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేసింది.

corona Impact on Indian Economy
భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం
author img

By

Published : Jun 10, 2020, 4:52 PM IST

కరోనా సంక్షోభంతో గాడి తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరంలో తిరిగి పట్టాలెక్కుతుందని ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ అంచనా వేసింది. 2021-22లో 9.5 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని లెక్కగట్టింది. కరోనా కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 5 శాతం మేర క్షీణిస్తుందని అంచనా వేసింది ఫిచ్.

కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వృద్ధిని బలహీనపరించిందని.. పెరిగిన ప్రజా రుణభారం కారణంగా అనేక సవాళ్లను తీసుకువచ్చిందని ఫిచ్​ అభిప్రాయపడింది.

ప్రపంచ సంక్షోభం తర్వాత భారత దేశ జీడీపీ 'బీబీబీ' కేటగిరీలోని దేశాల కంటే వేగంగా పుంజుకుంటుందని పేర్కొంది ఫిచ్. ఇదీ కరోనా వైరస్‌ కారణంగా ఆరోగ్య, ఆర్థిక రంగాలు మరింత సంక్షోభంలోకి జారిపోకుండా నివారిస్తుందని అంచనా వేసింది.

ఇదీ చూడండి:వాట్సాప్ ద్వారా డబ్బుల ట్రాన్స్​ఫర్​ ఎలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.