ETV Bharat / business

'సానుకూల వృద్ధికి అత్యంత చేరువలో భారత్' - భారత జీడీపీపై కరోనా ఆర్​బీఐ అంచనాలు

దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా సంక్షోభం నుంచి V ఆకారపు రికవరీని సాధిస్తున్నట్ల ఆర్​బీఐ విడుదల చేసిన నివేదిలో పేర్కొన్నారు నిపుణులు. ఇందులో V అంటే వ్యాక్సిన్ అని చమత్కరించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభమైన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా రికవరీ సాధిస్తోందనే అభిప్రాయాన్ని ఈ విధంగా వ్యక్తం చేశారు.

RBI's January Bulletin on Economy
భారత ఆర్థిక వ్యవస్థపై ఆర్​బీఐ అంచనాలు
author img

By

Published : Jan 21, 2021, 5:47 PM IST

దేశ ఆర్థిక వ్యవస్థ సానుకూల వృద్ధి రేటును నమోదు చేసేందుకు అత్యంత సమీపంలో ఉన్నట్లు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్​బీఐ) తెలిపింది. తాజాగా విడుదల చేసిన జనవరి బులెటిన్​లో ఈ విషయం వెల్లడించింది. ఆర్థిక వ్యసస్థ ప్రస్తుతం 'V' ఆకారపు రికవరీని సాధిస్తున్నట్లు తెలుస్తోందని వివరించింది. ఇందులో 'V' అంటే వ్యాక్సిన్​ అని బులిటెన్​లో కథనం రాసిన ఆర్​బీఐ నిపుణులు చమత్కరించారు.

ఆర్​బీఐ బులెటిన్​లోని ముఖ్యాంశాలు..

కరోనాపై పోరాటంలో భాగంగా జనవరి 16న టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభించింది ప్రభుత్వం. ప్రపంచంలోనే మన దేశానికి అతిపెద్ద టీకా ఉత్పత్తి సామర్థ్యం ఉండడం సహా.. ఇదివరకే పోలియో, మశూచి వంటి వ్యాధులకు భారీ ఎత్తున వ్యాక్సిన్ ప్రక్రియ చేపట్టిన అనుభవం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఆర్​బీఐ నిపుణులు.

ఇది (టీకా ప్రక్రియ) విజయవంతమైతే.. రిస్క్ స్థాయి తగ్గుతుందని ఆర్​బీఐ డిప్యూటీ గవర్నర్​ మైఖేల్ దేబబ్రతా పాత్ర పేర్కొన్నారు. ఆర్​బీఐ బులెటిన్​లో కథనం రాసినవారిలో ఈయన కూడా ఒకరు.

దేశార్థికం రికవరీలో ఈ-కామర్స్, డిజిటల్​ టెక్నాలజీ రంగాలు కీలక పాత్ర పోషించే అవకాశముందని ఆర్​బీఐ విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే ఉత్పాదన, ఉద్యోగ కల్పన విషయంలో కొవిడ్ ముందుస్థాయి పరిస్థితులు వచ్చేందుకు మాత్రం ఇంకా చాలా సమయం పట్టొచ్చని అభిప్రాయపడ్డారు.

'కరోనా వల్ల ఏర్పడిన సంక్షోభం నుంచి కోలుకోవడానికి చాలా ఏళ్లు పడుతుంది. అయితే వినూత్న విధానాలు మహమ్మారిని కూడా అవకాశంగా మార్చగలవు. మరి 2021-22 కేంద్ర బడ్జెట్ గేమ్​ ఛేంజర్ కాగలదా?' అని విశ్లేషకులు పేర్కొన్నారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్​లో బడ్జెట్​ ప్రవేశపెట్టనున్నారు.

ఈ కథనంపై స్పందించిన ఆర్​బీఐ.. ఇందులో పేర్కొన్న విషయాలన్నీ రచయితల వ్యక్తిగతమేనని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:రూ.49వేలపైకి 10 గ్రాముల పసిడి ధర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.