ETV Bharat / business

'గ్యాస్‌ ధరల నిర్ణయాధికారాన్ని వదిలేస్తాం' - Gas price updates

గ్యాస్​ ధరల నియంత్రణ దశల వారీగా వదిలేస్తామని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. వాటి ధరలను మార్కెట్​కు అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించారు. కాగా దేశంలో చమురు డిమాండ్‌ 2019 జూన్‌తో పోలిస్తే 85 శాతంగా ఉందని ప్రధాన్‌ చెప్పారు.

India to gradually end govt control on gas pricing: Pradhan
'గ్యాస్‌ ధరల నిర్ణయాధికారాన్ని వదిలేస్తాం'
author img

By

Published : Jun 26, 2020, 10:32 PM IST

పెట్రోల్‌, డీజిల్‌ మాదిరిగానే గ్యాస్‌ ధరలనూ మార్కెట్‌ శక్తులకు అనుసంధానం చేసేందుకు రంగం సిద్ధమైంది. దశలవారీగా గ్యాస్‌ ధరలపై నిర్ణయాధికారాన్ని వదిలేస్తామని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శుక్రవారం చెప్పారు. వాటి ధరలను మార్కెట్‌కు అనుసంధానం చేస్తామని వెల్లడించారు.

దేశంలో చమురు డిమాండ్‌ 2019 జూన్‌తో పోలిస్తే 85 శాతంగా ఉందని ప్రధాన్‌ చెప్పారు. 2021 ఆర్థిక ఏడాది రెండో త్రైమాసికానికి డిమాండ్‌ సాధారణ స్థితికి చేరుకుంటుందని తెలిపారు. సెప్టెంబర్‌-అక్టోబర్‌లో జెట్‌ ఇంధనం మినహా చమురు గిరాకీ కరోనా మునుపటి స్థితికి చేరుకుంటుందని పేర్కొన్నారు.

ఇరవై రోజులుగా పెట్రోల్‌, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. పెట్రోల్‌ను మించి డీజిల్‌ ధరలు పెరగడం వాహనదారులను కలవరపెడుతోంది. ప్రస్తుతం రెండింటి ధరలు లీటరుకు రూ.80 పైనే ఉన్నాయి. 2030కి దేశీయ చమురు శుద్ధీకరణ సామర్థ్యం 439 ఎంటీపీఏ, 2040కి 533 ఎంటీపీఏకు పెరుగుతుందని ప్రధాన్‌ తెలిపారు. బీపీసీఎల్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు.

ఇదీ చూడండి: మైక్రోసాఫ్ట్ రిటైల్ స్టోర్లు శాశ్వతంగా బంద్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.