ETV Bharat / business

కరోనాలోనూ కరెంట్‌ ఖాతా మిగులు - India current account surplus

కరోనా సంక్షోభంలోనూ 2020-21లో భారత్​ తన జీడీపీలో 0.9 శాతం మేర కరెంట్‌ ఖాతా మిగులును నమోదు చేసినట్లు బుధవారం ఆర్‌బీఐ గణాంకాలను విడుదల చేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంతక్రితం ఏడాదితో పోలిస్తే 43 బిలియన్​ డాలర్ల నుంచి 44 బిలియన్‌ డాలర్లకు పెరిగాయని తెలిపింది.

RBI
ఆర్బీఐ
author img

By

Published : Jul 1, 2021, 6:19 AM IST

కరోనా ఇబ్బంది పెట్టినా 2020-21 ఏడాదిలో భారత్‌ తన జీడీపీలో 0.9 శాతం మేర కరెంట్‌ ఖాతా మిగులును నమోదు చేయడం విశేషం. గతేడాది ఆర్థిక సంవత్సరంలో 0.9 శాతం కరెంట్‌ ఖాతా, లోటు నమోదైంది.

మార్చి త్రైమాసికంలో కరెంట్​ ఖాతా లోటు 8.1 బిలియన్‌ డాలర్లు లేదా జీడీపీలో 1 శాతానికి చేరింది. అంత క్రితం ఏడాది ఇదే సమయంలో ఇది 0.6 బిలియన్‌ డాలర్లు లేదా జీడీపీలో 0.1 శాతంగా మాత్రమే ఉంది. ఇక డిసెంబరు త్రైమాసికం (2020-21)లోనూ లోటు 0.3 శాతంగా నమోదైనట్లు బుధవారం ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. 2019-20లో వాణిజ్య లోటు 157.5 బిలియన్‌ డాలర్ల నుంచి 102.2 బిలియన్‌ డాలర్లకు తగ్గడంతో కరెంట్‌ ఖాతా నిల్వలు కాస్తా మిగులులోకి వెళ్లాయని ఆర్‌బీఐ పేర్కొంది.

  • కరోనా ఉన్నప్పటికీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంతక్రితం ఏడాదితో పోలిస్తే 43 బిలియన్​ డాలర్ల నుంచి 44 బిలియన్‌ డాలర్లకు పెరిగాయని తెలిపింది.
  • నికర విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు కూడా 1.4 బి. డాలర్ల నుంచి ఏకంగా 36.1 బిలియన్​ డాలర్లకు పెరిగాయి.
  • 2020-21లో విదేశీ మారక నిల్వలు 99.2 బిలియన్‌ డాలర్ల మేర పెరిగాయి. గతేడాది 64.9 బిలియన్​ డాలర్లే వృద్ధి చెందాయి. ఇతర 'ఫ్రధాన కరెన్సీ'లతో పోలిస్తే అమెరికా డాలరు క్షీణించడం ఇందుకు కారణం.
  • మార్చి 2021 నాటికి భారత విదేశీ రుణాలు 11.5 బిలియన్‌ డాలర్లు పెరిగి 570 బిలియన్‌ డాలర్లకు చేరాయి. విదేశీ రుణాలు, జీడీపీ మధ్య నిష్పత్తి అంతక్రితం ఏడాది మార్చి చివరతో పోలిస్తే 20.6 శాతం నుంచి 21.1 శాతానికి పెరిగింది.
  • విదేశీ వాణిజ్య రుణాలు అంతక్రితం ఏడాది 21.7 బిలియన్​ డాలర్లు ఉండగా.. 2020-21లో 0.2 బిలియన్​ డాలర్లుగానే నమోదయ్యాయి.
  • బ్యాంకుల ఆహారేతర రుణాల వృద్ధి.. మే 2021లో 5.9 శాతంగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో ఇది 6.1 శాతంగా ఉంది. అయితే వ్యవసాయ, అనుబంధ రంగాల రుణాలు మాత్రం మే 2020లో 5.2 శాతం పెరగ్గా.. ఈ ఏడాది మే నెలలో 10.3 శాతం వృద్ధి చెందడం విశేషం.

ఇదీ చూడండి: సామాన్యుడికి షాక్​- పాల ధరలు పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.