ETV Bharat / business

కరోనాతో భారత్ బ్రాండ్ విలువ 21% డౌన్ - బ్రాండ్ విలువపై కరోనా ప్రభావం

బ్రాండ్ విలువ పరంగా 2 ట్రిలియన్​ డాలర్లతో భారత్​ ఈ ఏడాదీ 7వ స్థానంలో నిలిచిందని ఓ ప్రైవేటు సంస్థ నివేదిక పేర్కొంది. కరోనా కారణంగా బ్రాండ్ విలువ దాదాపు 21 శాతం తగ్గినప్పటికీ అదే ర్యాంక్​లో కొనసాగటం గమనార్హం. అత్యధిక బ్రాండ్ విలువ ఉన్న దేశాల జాబితాలో.. అమెరికా 23.73 ట్రిలియన్​ డాలర్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నట్లు నివేదిక పేర్కొంది.

WHAT IS INDIA BRAND VALUE NOW
భారత్ బ్రాండ్ విలువ ఎంత
author img

By

Published : Nov 13, 2020, 1:22 PM IST

కరోనా సంక్షోభం వల్ల భారత్​ బ్రాండ్ విలువ 20.8 శాతం తగ్గినట్లు ఓ నివేదిక పేర్కొంది. అయినప్పటికీ 2 ట్రిలియన్​ డాలర్ల బ్రాండ్ విలువతో.. అత్యంత విలువైన దేశాల జాబితాలో 7వ స్థానాన్ని కొనసాగిస్తున్నట్లు 'బ్రాండ్ ఫినాన్స్' నివేదిక వెల్లడించింది.

బ్రాండ్ ఫినాన్స్​ నివేదికలోని మఖ్యాంశాలు..

  • అమెరికా 23.73 ట్రిలియన్​ డాలర్ల బ్రాండ్ విలువతో అత్యంత విలువైన దేశాల జాబితాలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కరోనా వల్ల అమెరికా బ్రాండ్ విలువ 14.5 శాతం తగ్గింది.
  • చైనా 3.7 శాతం బ్రాండ్​ విలువను కోల్పోయినా.. 18.76 ట్రిలియన్​ డాలర్ల బ్రాండ్ విలువతో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది.
  • జపాన్ మాత్రం బ్రాండ్ విలువలో 6 శాతం కోల్పోయినప్పటికీ.. 4.26 ట్రిలియన్ డాలర్ల బ్రాండ్​ విలువతో మూడో స్థానానికి ఎగబాకింది.
  • ఇంతకు ముందు మూడో స్థానంలో ఉన్న జర్మనీ 21.5 శాతం విలును కోల్పోవడం వల్ల.. 3.81 ట్రిలియన్ డాలర్ల బ్రాండ్​ విలువతో 4వ స్థానంతో సరిపెట్టుకుంది.
  • బ్రాండ్ విలువ పరంగా బ్రిటన్​ 5, ఫ్రాన్స్​, 6, కెనడా 8, ఇటలీ 9, దక్షిణ కొరియా 10 స్థానాల్లో ఉన్నాయి.
  • కరోనా వల్ల టాప్​ 10 దేశాల బ్రాండ్ విలువ సగటున 14 శాతం తగ్గింది.
  • బ్రాండ్​ విలువ పెరిగిన టాప్ 20 దేశాల్లో ఐర్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ దేశం బ్రాండ్ విలువ కరోనా కాలంలోనూ 11 శాతం పెరిగి.. 670 బిలియన్ డాలర్లకు చేరింది.
  • తయారీ రంగ హబ్​గా ఎదుగుతున్న వియత్నాం బ్రాండ్ విలువ కూడా భారీగా 29 శాతం పెరిగింది.
  • అర్జెంటీనా బ్రాండ్ విలువ అత్యధికంగా 57 శాతం తగ్గింది. వేగంగా బ్రాండ్ విలువ తగ్గిపోతున్న దేశాల జాబితాలో అర్జెంటీనా మొదటి స్థానంలో ఉంది. అమెరికా తర్వాత కరోనా సంక్రమణ రేటు అత్యధికంగా ఉన్న దేశం ఇదే కావడం వల్ల బ్రాండ్ విలువ ఈ స్థాయిలో పడిపోతోంది.
  • నేషన్ బ్రాండ్ పవర్ పరంగా.. జర్మనీ 100కు 84.9 స్కోర్​తో అగ్రస్థానంలో ఉంది. 83 స్కోర్​తో బ్రిటన్ రెండో స్థానంలో నిలిచింది.
  • టాప్ 100 దేశాల బ్రండ్​ విలువ 2019లో 98 ట్రిలియన్ డాలర్లుగా ఉంటే.. 2020లో 84.9 ట్రిలియన్​ డాలర్లకు తగ్గింది.

ఇదీ చూడండి:వృత్తి నిపుణుల్లో ఆదాయ వృద్ధిపై ఆశావాదం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.