ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలన్నింటిలో(జీ-20 దేశాల్లో) భారత జీడీపీ.. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో అత్యధిక క్షీణతను నమోదు చేసినట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) వెల్లడించింది.
జీ-20 దేశాలకు సంబంధించి ఐఎంఎఫ్ ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ ట్విట్టర్లో ఓ గ్రాఫ్‌ను షేర్ చేశారు. ఇందులో భారత్ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో(ఈ ఏడాది క్యూ1తో పోలిస్తే).. 25.6 శాతం ప్రతికూల వృద్ధి రేటుతో చివరి స్థానంలో ఉంది.
భారత్ తర్వాత అత్యధికంగా జీడీపీ పతనమైన దేశాల్లో బ్రిటన్ రెండో స్థానంలో నిలిచింది. బ్రిటన్ వృద్ధి రేటు ఏప్రిల్-జూన్ మధ్య -20.4 శాతంగా నమోదైనట్లు తెలిసింది.
చైనా సానుకూల వృద్ధి..
చైనా జీడీపీ మాత్రం ఏప్రిల్-జూన్ మధ్య 12.3 శాతం పెరిగింది. ఇదే సంవత్సరం క్యూ1లో చైనా వృద్ధి రేటు రికార్డు స్థాయిలో పతనమైన విషయం తెలిసిందే. ఈ గ్రాఫ్‌లో సానుకూల వృద్ధి నమోదు చేసిన దేశం కూడా చైనా ఒక్కటే కావడం గమనార్హం.
ఏడాదంతా ప్రతికూలమే..
అగ్రరాజ్యం అమెరికా 2020 రెండో త్రైమాసింకలో -9.1 శాతం, ఐరోపా సమాఖ్య (ఈయూ) -11.7 శాతం వృద్ధి రేటును నమోదు చేశాయి. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో ఈ స్థాయిలో వృద్ధి రేట్లు పతనమైనట్లు గీతా గోపినాథ్ పేర్కొన్నారు. 2020 మూడో త్రైమాసికంలో వృద్ధి రేటు కాస్త పుంజుకున్నా.. పూర్తి సంవత్సరంలో మాత్రం భారీ క్షీణతే ఉంటుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
-
In #GreatLockdown Q2 2020 GDP growth at historical lows. Graph puts G20 growth numbers on a comparable scale, quarter-on-quarter non-annualized. Should expect rebounds in Q3 but 2020 overall will see major contractions. China recovers strongly in Q2 after collapse in Q1. pic.twitter.com/OcgaZsrAD6
— Gita Gopinath (@GitaGopinath) September 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">In #GreatLockdown Q2 2020 GDP growth at historical lows. Graph puts G20 growth numbers on a comparable scale, quarter-on-quarter non-annualized. Should expect rebounds in Q3 but 2020 overall will see major contractions. China recovers strongly in Q2 after collapse in Q1. pic.twitter.com/OcgaZsrAD6
— Gita Gopinath (@GitaGopinath) September 2, 2020In #GreatLockdown Q2 2020 GDP growth at historical lows. Graph puts G20 growth numbers on a comparable scale, quarter-on-quarter non-annualized. Should expect rebounds in Q3 but 2020 overall will see major contractions. China recovers strongly in Q2 after collapse in Q1. pic.twitter.com/OcgaZsrAD6
— Gita Gopinath (@GitaGopinath) September 2, 2020
దేశీయ గణాంకాలు..
ఈ వారమే కేంద్ర గణాంక కార్యాలయం విడుదల చేసిన ఆర్థిక గణాంకాల ప్రకారం.. భారత జీడీపీ 2020-21 రెండో త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 23.9 ప్రతికూల వృద్ధిని నమోదు చేసినట్లు తేలింది. ఈ త్రైమాసికంలో చాలా వరకు లాక్డౌన్ ఉన్న కారణంగా భారీ స్థాయిలో వృద్ధి పతనమైనట్లు కేంద్రం పేర్కొంది.
దీనిపై మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాశ్ చంద్రగార్గ్ స్పందిస్తూ.. భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి ఇంకా తగ్గలేదని పేర్కొన్నారు. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలోనూ 12-15 శాతం క్షీణత నమోదవ్వచ్చని అంచనా వేశారు.
ఇదీ చూడండి:కరోనాతో పేదరికంలోకి 4.7 కోట్ల మంది మహిళలు!