దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లను ఆదుకునేందుకు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు కీలక ప్రకటన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ వివరాలను వెల్లడించారు. పేద, మధ్య తరగతి ప్రజలకు చేయూత అందించేలా ప్రణాళికలు రూపొందించారు. ఆత్మ నిర్భర భారత్ అభియాన్‌కు సంబంధించిన వివరాలను ఈ రోజు నుంచి ఒక్కొక్కటిగా వెల్లడిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ ఆర్ధిక ప్యాకేజీలో భాగంగా 15 అంశాల్లో కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేశారు. వాటి వివరాలు సంక్షిప్తంగా...
ప్యాకేజీ ముఖ్యాంశాలు
ఎంఎస్ఎంఈల కోసం ఆరు చర్యలు
వేతన జీవులకు ఊరట
కంపెనీ, ఉద్యోగుల పీఎఫ్ కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని 12 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నట్లు నిర్మల తెలిపారు. ఫలితంగా ఉద్యోగుల చేతికి అందే జీతం(టేక్ హోమ్ సేలరీ) పెరగనుంది. దీని వల్ల ఉద్యోగులకు మూడు నెలలకు గాను రూ.6,750 కోట్లు లబ్ధి చేకూరనుంది.
లిక్విడిటీ పెంపు కోసం