ETV Bharat / business

ఆ పాలసీతో ఉద్యోగం పోయినా ఆర్థిక అండ! - ఉద్యోగ నష్ట బీమా తీసుకోవడం ఎలా

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్షోభం నడుస్తోంది. ఉద్యోగాలు కోల్పోతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోయినా.. ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా చూసుకోవడం ఎలా? జాబ్​లాస్​ పాలసీ మీకు ఎలా తోడుంటుంది? అనే విషయాలపై ప్రత్యేక కథనం మీ కోసం.

job loss insurance
ఉద్యోగ నష్ట బీమా
author img

By

Published : Jul 9, 2020, 3:24 PM IST

సుమంత్-హేమంత్ ఇద్దరూ ఒకే దగ్గర ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరి జీతం సమానమే. అయితే కరోనా కారణంగా వారు పని చేస్తున్న సంస్థ భారీ నష్టాల్లో కూరుకుపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగాల కోత విధించింది. సుమంత్​, హేమంత్ ఇద్దరూ ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది.

ఉద్యోగం కోల్పోయిన కారణంగా సుమంత్ ఈఎంఐలు కట్టలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు. కనీస ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హేమంత్ మత్రం ఉద్యోగం పోయినా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోలేదు. పైగా ఈఎంఐలు చెల్లించేందుకు, ఇంటి అవసరాలకు డబ్బు కొరత లేదు. అదేమిటి... ఒకే ఆఫీసులో పని చేసే ఇద్దరికీ ఉద్యోగం పోయినప్పుడు.. ఇద్దరికీ ఆర్థిక ఇబ్బందులు తలెత్తాలి కదా? మరి సుమంత్ మాత్రమే ఇబ్బందుల్లో ఎందుకు ఉన్నాడు? హేమంత్​ పరిస్థితి మెరుగ్గా ఎందుకు ఉంది? అంటే హేమంత్ ముందు చూపుతో తీసుకున్న జాగ్రత్తే ఇందుకు కారణం. హేమంత్ తీసుకున్న ఆ జాగ్రత్త పేరే 'జాబ్​ లాస్​ పాలసీ'.

జాబ్​ లాస్​ పాలసీ అంటే ఏమిటి?

ఎవరైనా.. అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోతే ఆర్థికంగా వారికి అండగా నిలిచేదే జాబ్​ లాస్ పాలసీ. నిర్ణీత సమయం వరకు పాలసీదారుడి ఆర్థిక అవసరాలు తీర్చుకునే మొత్తాన్ని ఇవ్వడం ఈ బీమా ముఖ్య ఉద్దేశం. అయితే పాలసీల్లో ఉండే నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగం కోల్పోయిన వారికి మాత్రమే.. నష్టపరిహారం ఇస్తాయి బీమా కంపెనీలు.

యాడ్​ ఆన్​గా మాత్రమే బీమా..

ఏ బీమా సంస్థ కూడా ప్రత్యేకించి జాబ్​ లాస్ పాలసీను ఇవ్వడం లేదు. ఇప్పటికే ఉన్న ఆరోగ్య బీమా (తీవ్ర ఆనారోగ్యానికి కవర్​ఇచ్చే పాలసీలు), ప్రమాద బీమా, గృహ బీమాపై యాడ్​ ఆన్​గా జాబ్​ లాస్ పాలసీ తీసుకునేందుకు వీలుంది. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. ఆరోగ్య బీమాకు అదనంగా తీసుకునే జాబ్​ లాస్ పాలసీలు.. ఉద్యోగి తీవ్ర అనారోగ్యంతో ఉద్యోగం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే క్లెయిమ్​కు అనుమతిస్తుంటాయి.

వేటికి ధీమా?

ఏదైనా పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోతే.. తక్షణ ఆర్థిక ఉపశమనం కల్పిస్తుంది జాబ్​ లాస్ పాలసీ. మీరు చెల్లించాల్సి ఈఎంఐలలో మూడు పెద్ద మొత్తాలను భరిస్తుంది.

జాబ్​ లాస్ పాలసీ ఇచ్చే కంపెనీలు..

ఐసీఐసీఐ లాంబార్డ్ నుంచి సెక్యూర్​ మైండ్ క్రిటికల్ ఇల్​నెస్ ప్లాన్​లో ఇది అందుబాటులో ఉంది.

హోమ్​ సురక్ష ప్లస్ (హోమ్ లోన్ రక్షణ ప్లాన్) పేరుతో హెచ్​డీఎఫ్​సీ ఎర్గో ఓ కవర్ అందిస్తోంది.

రాయల్ సుందరం సేఫ్​ లోన్ షీల్డ్ (క్రిటికల్ ఇల్​నెస్​ ప్లాన్​) అందుబాటులో ఉంది.

బీమా సంస్థలు ఈ రకమైన ఇన్సూరెన్స్ ఇచ్చే ముందు పాలసీ తీసుకునే వ్యక్తి ఉద్యోగం పోయే ప్రమాదాన్ని అంచనా వేస్తాయి. దీని ఆధారంగానే.. వారికి ప్రీమియంను నిర్ణయిస్తాయి.

జాబ్​ లాస్ పాలసీలో పరిశీలించాల్సిన విషయాలు..

ఉద్యోగం పోయే పరిస్థితులను అంచనా వేయడానికి రాతపూర్వక రిట్రెచ్​మెంట్ పత్రం ముఖ్యమైంది.

ముందస్తు రిటైర్​మెంట్​, తప్పుడు ప్రవర్తన, ముందస్తు ఆనారోగ్య సమస్యలు చెప్పకపోవడం, ఏదైనా మోసం చేయడం వల్ల ఉద్యోగం కోల్పోతే వారికి బీమా వర్తించదు. పాలసీ వెయింటింగ్ పీరియడ్​లో ఉన్నప్పుడే ఉద్యోగం పోయినా క్లెయిమ్ చేసుకునేందుకు వీలుండదు. ఈ విషయాలను పాలసీ తీసుకునే ముందే తెలుసుకోవాలి.

ముఖ్యంగా జాబ్​ లాస్ పాలసీ మీ బేసిక్ సేలరీలో 6 నెలలను కవర్​ చేసేలా చూసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా ముఖ్యమైన విషయం.

(రచయిత:ఇందూ చౌదరి, పర్సనల్ ఫినాన్స్ నిపుణురాలు)

  • గమనిక:ఈ కథనంలోని అన్ని విషయాలు రచయిత దృష్టి కోణంలో రాసినవి మాత్రమే. వీటితో ఈటీవీ భారత్​కు, సంస్థ యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు.
  • పర్సనల్ ఫినాన్స్​కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే businessdesk@etvbharat.com ను సంప్రదించొచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.