ETV Bharat / business

మార్చిలో స్వల్పంగా తగ్గిన జీఎస్టీ వసూళ్లు - జీఎస్టీ వసూళ్లు

మార్చి నెలలో జీఎస్టీ వసూళ్ల రూపంలో కేంద్రానికి రూ.97,597 కోట్ల ఆదాయం వచ్చిందని ఆర్థిక శాఖ తెలిపింది. ఇందులో దిగుమతుల ద్వారా రూ.18 వేల కోట్లు వసూలు అయినట్లు వెల్లడించింది.

gst
జీఎస్టీ
author img

By

Published : Apr 1, 2020, 6:35 PM IST

ఆర్థిక సంవత్సరంలో చివరిదైన మార్చిలో జీఎస్టీ వసూళ్లు స్వల్పంగా తగ్గాయి. ఈ నెలకు సంబంధించి జీఎస్టీ రూపంలో రూ.97,597 కోట్ల ఆదాయం గడించింది కేంద్రం. ఫిబ్రవరిలో రూ.1.05 లక్షల కోట్లు వసూలు అయ్యాయి.

మొత్తం వసూళ్లలో కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ) రూపంలో రూ.19,183 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ (ఎస్ జీఎస్టీ)ల ద్వారా రూ.25,601 కోట్లు వచ్చాయి. మిగిలిన రూ.44,508 కోట్లు ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ కింద వసూలు అయినవి. ఇందులో దిగుమతుల ద్వారా రూ.18,056 కోట్లు వచ్చినట్లు ఆర్థిక శాఖ తెలిపింది.

మార్చి 31 వరకు 76.5 లక్షల జీఎస్టీ-3బి రిటర్నులు దాఖలైనట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.

ఇదీ చూడండి: ఈఎంఐ 3 నెలలు వాయిదా వేస్తే ఇంత నష్టమా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.