ETV Bharat / business

జీఎస్​టీ మోసాల కేసుల్లో 258 మంది అరెస్టు - నకిలీ జీఎస్​టీ బిల్లుల కేసులో స్వాధీనం సొమ్ము

డొల్ల కంపెనీల పేరుతో జీఎస్​టీ మోసాలకు పాల్పడుతున్న వారి నుంచి ఇప్పటి వరకు రూ.820 కోట్లు జప్తు చేశారు అధికారులు. 258 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఇందులో 8 మంది ఛార్టెడ్​​ అకౌంటెంట్లూ ఉన్నట్లు తెలిపారు.

Number of people involve bogus companies
నకిలీ జీఎస్​టీల కేసుల్లో అరెస్టయి వారి సంఖ్య
author img

By

Published : Jan 25, 2021, 4:08 PM IST

నకిలీ జీఎస్​టీ ఇన్​వాయిస్​ల కేసుల్లో.. ఇప్పటి వరకు 258 మందిని అరెస్టు చేశారు జీఎస్​టీ ఇంటెలిజెన్స్​ అధికారులు. ఇందులో కనీసం 8 మంది ఛార్టెడ్ అకౌంటెంట్లు (సీఏలు) ఉన్నట్లు తెలిపారు. వీరంతా పెద్ద సంఖ్యలో డొల్ల కంపెనీలను నడిపిస్తూ.. ఇన్​పుట్​ ట్యాక్స్ క్రెడిట్​ను క్లెయిమ్​ చేసుకుంటున్నట్లు గుర్తించామని అధికారులు వివరించారు.

మొత్తం 8,000 వేల నకిలీ జీఎస్​టీ నంబర్లతో నిర్వహిస్తున్న డొల్ల కంపెనీలపై 2,500కిపైగా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చివరగా అరెస్టు చేసిన ఛార్టెడ్​ అకౌంటెంట్​ ఎలాంటి వస్తు, సేవల కార్యకలాపాలు లేకుండానే.. 25 నకిలీ సంస్థలను నడిపిస్తున్నట్లు తెలిపారు.

గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న 258 మందిలో కనీసం ఇద్దరిపై కన్సర్వేషన్​ ఆఫ్​ ఫారిన్ ఎక్స్ఛేంజ్​ అండ్ ప్రివెన్షన్​ ఆఫ్ స్మగ్లింగ్ యాక్ట్​ కింద కేసులు నమోదు చేసినట్లు వివరించారు జీఎస్​టీ ఇంటెలిజెన్స్ అధికారులు. జీఎస్​టీ మోసాలకు పాల్పడుతున్న వారి నుంచి ఇప్పటి వరకు రూ.820 కోట్లు జప్తు చేసినట్లు పేర్కొన్నారు.

'బీఏఎఫ్​టీఏ టూల్స్​తో పాటు డేటా అనలటిక్స్, డేటా షేరింగ్, కృత్రిమ మేధ వంటి సాంకేతికతలను ఉపయోగించి.. నకిలీ సంస్థల కార్యకలాపాలను గుర్తించాం' అని అధికారులు 'ఈటీవీ భారత్​'కు వివరించారు.

అరెస్టయిన సీఏలు..

బోగస్ జీఎస్​టీ డీలర్లతో పాటు.. నకిలీ బిల్లులతో లబ్ధిపొందిన తుది వ్యక్తి వరకు అరెస్టయిన వారిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

నకిలీ కంపెనీలతో జీఎస్​టీ మోసాలకు పాల్పడుతున్న సీఏలలో.. బి శ్రీనివాస్​ రావు (హైదరాబాద్​), ఎస్​ కృష్ణకుమార్​ (చెన్నై), నితిన్​ జైన్​ (దిల్లీ), లలిత్​ ప్రజాపతి (అహ్మదాబాద్​), బీఎస్​ గుప్తా (జైపుర్​), దౌలత్​ ఎస్​ మెహతా, చంద్ర ప్రకాశ్​ పాండే (ముంబయి), అంకుర్​ గార్గ్​ (లథియానా)లు ఉన్నారు.

ఇదీ చూడండి:అంబానీ ఒక్క గంట సంపద= కూలీ 10వేల ఏళ్ల శ్రమ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.