ఆగస్టులో వస్తు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు రూ. 98 వేల 202 కోట్లుగా నమోదైనట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేశాయి. గతేడాది ఇదే నెలలో వసూలైన.. 93 వేల 960 కోట్ల రూపాయలతో పోల్చితే ప్రస్తుతం 4.5 శాతం మేర పెరిగినట్లు ప్రకటించింది.
జులై నెలలో జీఎస్టీ స్థూల ఆదాయం.. రూ. లక్షా 2 వేల కోట్లుగా నమోదైంది.
ఈ ఏడాదిలో జీఎస్టీ వసూళ్లు.. లక్ష కోట్ల దిగువకు చేరడం ఇది రెండోసారి. జూన్‌లోనూ రూ. 99 వేల 939 కోట్లు జీఎస్టీ ద్వారా వచ్చాయి.
ఆగస్టులో జీఎస్టీ వసూళ్ల లెక్కలు
- కేంద్ర జీఎస్టీ- రూ.17,733 కోట్లు
- రాష్ట్రాల జీఎస్టీ- రూ. 24,239 కోట్లు
- సమీకృత జీఎస్టీ- రూ.48,958 కోట్లు