ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం నిలకడగా సాగి, కరోనా ముందు నాటి పరిస్థితికి చేరుకోవాలంటే వృద్ధి జోరును మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఈ నెల 5న జరిగిన ద్రవ్య, పరపతి విధాన కమిటీ సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించిన వివరాలను ఆర్బీఐ సోమవారం విడుదల చేసింది.
"వృద్ధి రేట్లలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నా.. పుంజుకుంటోంది. వేగాన్ని కూడబెట్టుకుంటోంది. కొవిడ్ టీకా రాకతో అంచనాలు బాగా మెరుగయ్యాయి. అయితే ఈ వృద్ధి జోరును మరింత బలోపేతం చేయాలి." అని దాస్ అన్నారు. ద్రవ్యోల్బణ గణాంకాలను దృష్టిలో పెట్టుకొని పరపతి విధానంలో సర్దుబాటు ధోరణి కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: 'కేంద్రం, రాష్ట్రాల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా నివేదిక'