ETV Bharat / business

పద్దు 2020: రైతుల ఆదాయం రెట్టింపునకు బడ్జెట్ గుళికలివే

బడ్జెట్​ ప్రసంగంలో సంక్షేమ రాజ్య భావనకు పెద్ద పీట వేసింది కేంద్ర సర్కారు. 2022 నాటికి రైతుల ఆదాయన్ని రెట్టింపు చేసేందుకు గతంలో లక్షించిన కేంద్రం వ్యవసాయ రుణాలను 11 శాతం పెంచుతామని వెల్లడించింది. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వ్యయాలు తగ్గించి మిగులును పెంచే దిశగా బడ్జెట్​లో కేటాయింపులు చేసింది.

agri
పద్దు 2020: రైతుల ఆదాయం రెట్టింపునకు బడ్జెట్ గుళికలివే
author img

By

Published : Feb 1, 2020, 6:29 PM IST

Updated : Feb 28, 2020, 7:24 PM IST

రైతుల ఆదాయం రెట్టింపునకు బడ్జెట్ గుళికలివే

మూడు ప్రాధాన్యాంశాల్లో ప్రజా సంక్షేమం ఒకటని ఉద్ఘాటించిన కేంద్ర ప్రభుత్వం... బడ్జెట్​లో వ్యవసాయ రంగానికి ప్రోత్సాహకర రీతిలో కేటాయింపులు జరిపింది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యంగా రానున్న ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం దాని అనుబంధ రంగాలపై 1, 54,775 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించింది.

రూ. 15 లక్షల కోట్ల పరపతి

వ్యవసాయ రుణాలను 11 శాతం మేర పెంచి రూ. 15 లక్షల కోట్లను రైతులకు పరపతిగా అందించాలని సంకల్పించింది. ఇంతకుముందు ఉన్న 9 శాతం వడ్డీని 2 శాతానికి మార్చనుంది. ఎన్​బీఎఫ్​సీలతో సహా నాబార్డ్​ రీఫైనాన్స్​ పథకం ద్వారా వ్యవసాయ రుణాలు అందించాలని నిర్ణయం తీసుకుంది.

16 అంశాలతో కార్యాచరణ

వ్యవసాయానికి ప్రోత్సాహం, రైతు సంక్షేమం కోసం 16 అంశాల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది కేంద్ర సర్కారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో కిసాన్ రైలు​ను భారత రైల్వేల్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఈ రైల్లో శీతల గిడ్డంగి సౌకర్యం కల్పించి పాలు, మాంసం, చేపలు వంటి వాటిని ఆయా ప్రాంతాలకు చేర్చనుంది.

"6.11 కోట్లమంది రైతులకు వ్యవసాయ బీమా కల్పించాం. తృణధాన్యాల సాగుకు ప్రోత్సాహం కల్పించే దిశగా సూక్ష్మ వ్యవసాయాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. సుస్థిర వ్యవసాయ విధానాలు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం మా ప్రణాళికలో భాగం. ఇవి సాధించేందుకు రాష్ట్రప్రభుత్వాలతో కలిసి పనిచేయాల్సి ఉంది. 16 అంశాల కార్యాచరణ ప్రణాళిక మా చిత్తశుద్ధిని తెలుపుతుంది."

-నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి

గ్రామీణ మహిళ.. ఇక ధాన్యలక్ష్మి

స్వయం సహాయక బృందాల ద్వారా గ్రామ గిడ్డంగి పథకాన్ని అమలు చేయనుంది కేంద్రం. దీనిద్వారా మహిళలను ధాన్యలక్ష్మిగా మార్చనుంది. ఈ పథకం ద్వారా పంట అనంతర వ్యయాన్ని తగ్గించేందుకు చేయూత అందించనుంది.

రూ. లక్ష కోట్ల విలువైన చేపల ఎగుమతే లక్ష్యం

చేపల పెంపకంలో 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికల్లా 200 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించేందుకు సంకల్పించింది కేంద్రం. 2024-25 కల్లా చేపల ఎగుమతిలో రూ. లక్ష కోట్ల ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. చేపల పెంపకంలో మరింత పురోగతిని సాధించేందుకు 3477మంది యువతీ, యువకులకు 'సాగరమిత్ర'లుగా ప్రోత్సాహం అందించనుంది కేంద్రం.

100 కరవు జిల్లాల్లో నిర్మాణాత్మక కార్యాచరణ

100 నీటి ఎద్దడి ఉన్న జిల్లాల్లో నిర్మాణాత్మక పథకాలు అమలు చేస్తామని బడ్జెట్ ప్రకటనలో వెల్లడించింది కేంద్రం. వారికి అవసరమైన సహకారాన్ని అందించేందుకు కృషి చేస్తామని తెలిపింది.

సౌరవిద్యుత్.. మరింత విస్తరణ

వ్యవసాయంలో సౌర విద్యుత్​కు ప్రోత్సాహం కల్పించే దిశగా పీఎం-కుసుమ్ పథకాన్ని మరింత విస్తరించనుంది. 20 లక్షలమంది రైతులు సౌర విద్యుత్​తో నడిచే పంపుసెట్లను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించనుంది. మరో 15 లక్షలమంది రైతులను సౌరవిద్యుత్ గ్రిడ్​కు అనుసంధానిస్తామని ప్రకటించింది.

సమతూకంలో ఎరువులు

రసాయన, సేంద్రీయ ఎరువుల వాడకంలో సమతూకాన్ని పాటించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించింది కేంద్రం.
వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని పెంచి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది.

కృషి ఉడాన్ ద్వారా మార్కెటింగ్

'కృషి ఉడాన్' పథకం ద్వారా పౌరవిమానయాన శాఖ ఆధ్వర్యంలో ఈశాన్య రాష్ట్రాలు, గిరిజన జిల్లాల్లో వ్యవసాయానికి చేయూత అందించనుంది కేంద్రం. ఈ పథకం ద్వారా ఆయా ప్రాంతాల్లోని వారికి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించనుంది.

'కేంద్ర చట్టాలు అమలు చేయండి'

ఉద్యాన పంటలకు సంతృప్తకర స్థాయిలో మార్కెటింగ్ కల్పించేందుకు ఒక జిల్లాలో ఒకే ఉద్యానపంటను ప్రోత్సహిస్తామని స్పష్టం చేసింది. వ్యవసాయ రంగంలో వ్యవసాయ భూముల లీజింగ్-2016, మార్కెటింగ్ చట్టం-2017, కాంట్రాక్టు వ్యవసాయం-2018 లను ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అమలు చేయాలని సూచించింది సర్కారు.

ఇదీ చూడండి: బడ్జెట్​ 2020: నిర్మల పద్దులోని హైలైట్స్​

ZCZC
PRI ECO GEN NAT
.NEWDELHI PWR2
Concept Public Relations India Limited
Long term investors will need to identify quality businesses
(Eds: Disclaimer: The following content is a press release. PTI takes no editorial responsibility for the same.)
Sid Mehta, Founder and CIO, Bay Capital said that though the budget has not been path breaking, given the limited room for manoeuvre, the measures around the re-alignment on personal tax rates (notwithstanding the removal of the exemptions), the removal of the dividend distribution tax and the tax exemptions for sovereign wealth funds for investments in infrastructure are some of the positive developments. However, providing an option to personal taxpayers to either opt for the old or new regime seems counterproductive and complicated given the government's intent to simplify the overall governance structure.

Sid Mehta, Bay Capital further said that the 10% GDP nominal growth target is a realistic one given the overall environment as is maintaining of the deficit target at 3.5% for FY 21. Moreover, specific initiatives such as the privatisation of IDBI Bank, the proposal for the LIC to go in for an IPO, the revision of limits for FPI investments in corporate bonds are positive.

All in all, Siddharth Mehta believes that the budget will not have too much relevance beyond a few days. The focus of longer term investors will need to be around identifying and buying quality businesses which can navigate through challenging periods and emerge stronger, over time. There will be knee-jerk reactions, but specific policy announcements will continue to be made outside of the budget and Siddharth Mehta led Bay Capital continues to be positive about the long term opportunity for investing in India.

PWR
PWR
02011731
NNNN
Last Updated : Feb 28, 2020, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.